Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కుటుంబానికేమో పంచబక్ష పరమాన్నాలు..

-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నా పంచ ప్రాణాలనే జగన్ కు.. చిత్తశుద్ధి ఏమాత్రం లేదు
– అంగన్వాడీ సెంటర్ లలోని పిల్లలకు నాణ్యత లోపించిన ఆహారం
– ఉషశ్రీ చరణ్ తన ఇల్లు చక్కబెట్టుకోవడంలో, ల్యాండ్ కబ్జాలు చేసుకోవడంలో, ల్యాండ్ మాఫియా ద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకోవడంలో చూపే శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాల పట్ల చూపరు
– టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

అంగన్వాడీ పిల్లల తిండిపై కూడా జగన్ తన ఫోటో వేసుకోవడమేంటని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…
ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన జగన్ ప్రభుత్వం

నేడు జగన్ ప్రభుత్వం తన ప్రచార ఆర్భాటాన్ని పీక్ కు తీసుకెళ్లింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం, ఆ రంగులు తీసేయడంతో వైసీపీ ప్రభుత్వ పాలన మొదలైంది. చివరకు అంగన్ వాడీ సెంటర్స్ లలోని సరుకులు, సరుకుల కిట్స్, బ్యాగులపై జగన్ తన ఫొటో వేసుకుని ప్రచార ఆర్భాటాన్ని చాటుకున్నారు. ఆయన ప్రచార ఆర్బాటాన్ని అంగన్ వాడీ సెంటర్స్ లకు వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అంగన్ వాడీ సెంటర్స్ అంటే మనో వికాస కేంద్రాలుగా ఉండేవి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేద బిడ్డలే అంగన్ వాడీ కేంద్రాలకు వస్తారు.

వారికి అన్యాయం చేయడం పాపం. చంద్రబాబు హయాంలో అనేకమంది గర్భిణీలు, బాలింతలు, పేదవారికి పౌష్టిక ఆహారం అందించాలి, గర్భిణీలు ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలనే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా వారికి నాణ్యమైన ఫుడ్ అందించేవారు. పిల్లలకు పౌష్టిక ఆహార లోపం లేకుండా చూసేవారు. మంచి ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఐసీడిఎస్ ని ఉమెన్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారికి ఇచ్చే వస్తువులు పర్ ఫెక్ట్ గా చేరేలా చూశారు.

జగన్ అధికారంలోకి రాకముందు చేసిన పాదయాత్రలో అంగన్ వాడీ సెంటర్ లను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్ల, సూపర్ వైజర్ ల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ కన్నా ఎక్కువగా అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలిస్తానని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అంగన్వాడీ సెంటర్లు దయనీయపరిస్థితిలో ఉన్నాయి. జగన్ చిన్న పిల్లలకు మేన మామ కాదు.. కంస మామ అని నిరూపించుకున్నాడు.

జగన్ ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి అంగన్ వాడీ సెంటర్స్ ల ను పరిశీలించాలి. అంగన్వాడీ కేంద్రాలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఏనాడూ అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష జరపలేదు. రాష్ట్రంలో ఒక లక్షా 20 వేల మంది అంగన్ వాడీ వర్కర్స్ ఉన్నారు. వారికి ఆ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలియదు. అంగన్ వాడీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్నా ఆ శాఖ మంత్రి బయటికి రాదు. వైసీపీవారు అంగన్వాడీ వర్కర్ ను వేధించి చంపినా స్పందించరు.

అంగన్వాడీ పిల్లలు ఇబ్బంది పడ్డా పట్టించుకోరు. అంగన్ వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని వేలాది మంది ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించినా, ధర్నా చేసినా ఆమె చెవికెక్కదు. కలెక్టరేట్ ముందు 36 గంటలపాటు అంగన్వాడీ ఉద్యోగులు దీక్ష చేసినా ఆ శాఖామంత్రిలో చలనంలేదు. ఆమెలో చలనం రావాలి, నిద్ర మేల్కొనాలి. ఉషశ్రీ చరణ్ తన ఇల్లు చక్కబెట్టుకోవడంలో, ల్యాండ్ కబ్జాలు చేసుకోవడంలో, ల్యాండ్ మాఫీయా ద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకోవడంలో చూపే శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాల పట్ల చూపరు.

పేదలకిచ్చే ఫుడ్ లో నాణ్యత లోపించినా జగన్ కు చీమ కొట్టినట్లు కూడా ఉండదు. ల్యాండ్, శాండ్, మైన్ ద్వారా జగన్ కోట్ల రూపాయలు దోచుకొని దాచుకోవడం జరిగింది. ఇది చాలక పేద పిల్లలకు ఇచ్చే పౌష్టిక ఆహార సరఫరా లో కూడా అవినీతి చాటుకున్నారు. జగన్ పంచబక్ష పరమాన్నాలు తింటే అంగన్వాడీ పిల్లలు నాణ్యత లేని ఫుడ్ తింటున్నారు.

చంద్రబాబునాయుడు తన హయాంలో బాలామృతం, గోరుముద్దలు అనే పథకాలు పెడితే.. జగన్ వాటిని తీసేసి తన ప్రచార ఆర్భాటాలకు వైఎస్ ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకం పెట్టారు. ఇది ఉత్తుత్తి పథకం మాత్రమే. మెనూ ప్రకారం వేడి అన్నం పెట్టాలి. కానీ.. అలా పెట్టడంలేదు. చంద్రబాబునాయుడు తన హయాంలో ఒక కేజీ బెల్లం, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ గోధుమపిండి, ఒక కేజీ ఖర్చూరాలు, ఒక కేజీ రాగిపిండి ఇచ్చేవారు.

అంగన్ వాడీ టీచర్స్ పై వైసీపీ నాయకుల వేధింపులు
అంగన్ వాడీ టీచర్స్ వైసీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, మీ భర్త టీడీపీలో తిరుగుతున్నారని బలవంతంగా అంగన్ వాడీ టీచర్స్ కి మెమూలు ఇస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే కారులో ఎక్కించుకుని మెమో ఇస్తారా లేదా అని బెదిరించడం దారుణం. అంగన్ వాడీ కార్యకర్తలంటే జగన్ రెడ్డికి చులకనైపోయింది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని కృషి చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తపై ఈ విధమైన ఒత్తిడిలు తగవు.

అధికారుల ఒత్తిడి, అధికార పార్టీ నాయకుల వేధింపుల కారణంగా అంగన్ వాడీ వర్కర్స్ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాదయాత్రలో అంగన్ వాడీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నిజంగా పేదల పక్షపాతి ముఖ్యమంత్రివే అయితే చిన్నారుల పక్షాల కృషి చేస్తున్న ఒక లక్ష ఇరవై వేల మంది అంగన్ వాడీ వర్కర్స్ కి న్యాయం చేయాలి.

సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వారికి రావాల్సిన గాడ్యుయూటీ అమలు కావడం లేదు. పక్క రాష్ట్రాల్లో జీతాలు పెంచినట్లు మన రాష్ట్రంలో పెంచాలి. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చిన్నారులకు ఇచ్చే పౌష్టిహారంలో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గింది.. దీనిపై వినతిపత్రం అందజేస్తాం.

అపరిశుభ్రతకు నిలయాలు-అంగన్వాడీ కేంద్రాలు
రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలు గత ప్రభుత్వంలో మనో వికాస కేంద్రాలుగా ఉంటే.. నేడు ఎందుకు పనికిరాని కేంద్రాలుగా మారాయి. పలు అంగన్ వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరి.. అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. దాచుకోవడం, దోచుకోవడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రధ్ర ప్రభుత్వానికి చిన్నారులకు అండగా నిలవడంలో ఎందుకు లేదు.

ఇందు కారణంగా అంగన్ వాడీ కేంద్రాలకు చిన్నారులు రావడం లేదు. వైఎస్‍ఆర్ ఫోషణ పథకంలో మీరిచ్చే పౌష్టికారంలో నాణ్యత లోపించి అరకొరగా అందిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలు చెప్పుకునేందుకు ఆస్కారం లేకుండా చేసి వారికి మరింత అన్యాయం చేస్తున్నారు. అంగన్ వాడీ సిబ్బంది సమస్యలపై ఉద్యమం ఉదృతం చేస్తాం.

దేవుడి ప్రతిరూపాలనే పిల్లలకు పాచిపోయిన చిక్కీలు, పురుగులు పడ్డ అడుకులు

ప్రస్తుత ప్రభుత్వంలో అంగన్ వాడీల్లో ఇస్తున్న చిక్కీలు, అటుకులు చూస్తే మన పిల్లలకు మనమే ఇలాంటి పౌష్టిహారం ఇస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. చిన్నారులు దేవుళ్లతో సమానం. సైకో పరిపాలనలో అందిస్తున్న పౌష్టిహారం ఎవరు తినే పరిస్థితి లేదు. గర్భిణిలు, చిన్నారులు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టిహారం తినలేని పరిస్థితిలో ఉన్నారు. బలమైన, పోషణ లేని ఆహరం అందించలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కేవలం రంగులు, బొమ్మలు వేసేందుకే ప్రభుత్వం పరిమితమైంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచకుండా వివక్ష చూపుస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో అంగన్ వాడీ కేంద్రాలు చూడముచ్చటగా, ఆహ్లాదంగా, ఆనంకరంగా కొనసాగాయి. అటువంటి కేంద్రాలను సైకో జగన్ మోహన్ రెడ్ది బ్రష్టు పట్టించారు. పాదయాత్రలో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను సీఎం విస్మరించారు.

దాచుకోవడం, దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైంది. మంత్రి ఉషా శ్రీ చరణ్ ఇంటికే పరిమితమై అంగన్ వాడీ కేంద్రాలను పట్టించుకోవడం లేదు. ఒక్కసారి అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి మీ దృష్టికి వస్తుంది. చిన్నారులపై ఇచ్చే కోడిగుడ్లపై మీ ముద్ర వేసుకోవడం సిగ్గుచేటు. అంగన్ వాడీ కేంద్రాల పరిస్థితిపై చర్చకు సిద్ధం దమ్ముంటే మంత్రి, ప్రభుత్వ పెద్దలు చర్చకు సిద్ధమవ్వాలి.

అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్ కూడా లేని పరిస్థితి
మర్కాపురం నియోజకవర్గం సీతానాగులారం అనే గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తే అక్కడ కనీసం పిల్లలకు ఫ్యాన్ కూడా లేని పరిస్థితి నెలకొంది. అక్కడ చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లు, పురుగులు పట్టిన బియ్యం, నాణ్యత లేని పౌష్టిహారాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా చిన్నారులు, అంగన్ వాడీ సిబ్బందిపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. అంగన్ వాడీ సిబ్బంది సమస్యలపై లోకేశ్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో గ్రామంలో అంగన్ వాడీ టీచర్ అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇప్పటికీ టీచర్ కుటుంబానికి ఆర్థికసాయం చేయకుండా, వారి ఇంట్లో మరొకరికి ఉద్యోగం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలు తరిమికొడతారు.
ఈ పత్రికా సమావేశంలో పలువురు అంగన్వాడీ, డ్వాక్రా సభ్యులు పాల్గొన్నారు

 

LEAVE A RESPONSE