Omicron కేసులు పెరుగుతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంగా, పాఠశాలలు మూసివేయాలని, పాఠశాలలో బోధన ఆన్లైన్ పద్ధతిలో ఉండాలి తప్పితే, పిల్లలని స్కూల్ కి పిలిచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించకూడదని, తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది.
“తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో క్లారిటీ లోపం ఉందని, ఈ జీవో ప్రకారం సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ వివరణ ఇచ్చారని, మాకు సంక్రాంతి సెలవులు అన్ని రోజులు ఉండవని, అందుకని ఆ GO మాకు వర్తించదని, అందుకని ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తించవని, అందుకే స్కూల పిల్లలందరితో సెలవులు లేకుండా, తరగతులకు హాజరవ్వాలని చెప్పాము” అని వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్/ ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్లయితే, పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ కారణంగా అనారోగ్య పడకుండా, సత్ సంకల్పముతోనే Go విడుదల చేయడమైనది. తెలంగాణ ప్రభుత్వ సంకల్పం తుంగలో తొక్కుతూ, వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయురాలి మాట, పనితీరు, వివాదాస్పదంగా మారి చర్చనీయాంశమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా జిఓ విడుదల చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, విద్యార్థులకు corona సోకకుండా కాపాడుకోవాలని కనీస నైతిక ఆలోచన మరిచిన పాఠశాల ప్రిన్సిపల్ పై పిల్లల తల్లి తండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆల్రెడీ ఇదే పాఠశాలలో 3rd wave లోని సుమారు 62 మంది పిల్లలకి కోరనా బారిన పడ్డారంటే, పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది.కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సంయమనం సరిగ్గా లేని కారణంగా పిల్లలు కోరనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయ లో ప్రదర్శిస్తున్న, బాధ్యతారాహిత్య, మూర్ఖ వైఖరి వల్ల, పాఠశాల విద్యార్థులు రోగాన పడినట్లయితే, corona సూపర్ స్పెండర్ గా మారే అవకాశం ఉంటుందని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
-వ్యాకరణం