Suryaa.co.in

Telangana

రంగారెడ్డి నవోదయలో పరీక్షా పే చర్చకార్యక్రమం!

ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11 గంటకు రంగారెడ్డి, జవహర్ నవోదయ విద్యాలయలో  గౌరవనీయులైన ప్రధానమంత్రి ‘పరీక్ష పే చర్చ ’ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు  జరిగినవి. విద్యాలయ యొక్క ఆడిటోరియంలో  ప్రొజక్టర్ ఏర్పాటు చేయడమైనది. ఇందులో విద్యాలయ బాలబాలికలు (చుట్టూ పక్కల  పాఠశాలల నుండి వచ్చిన బాలబాలికలతో) సహా పాల్గొన్నారు.పాఠశాల ప్రాచార్యులు డేనియల్  రత్నకుమార్  పర్యవేక్షణలో విద్యాలయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని అత్యంతఆసక్తిగా వీక్షించారు.

ముందుగా ప్రధానమంత్రి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు . అందులో నవోదయ విద్యార్థులు ప్రదర్శించిన పేయింటింగ్స్ ను చూసారు. కార్యక్రమంలో ముందుగా విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ చే
nav2 స్వాగతోపన్యాసం జరిగింది. ఆ తరువాత కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన నవోదయ, కేంద్రీయ మరియు ఇతర విద్యాసంస్థల నుండి విచ్చేసిన విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. వారు అడిగిన పలురకాల సందేహాలకు సమాధానమును ఇచ్చారు.

విద్యార్థులు తరుచుగాపరీక్షల వల్ల ఎదురుకొను  ఒత్తిడి, మార్కులు, గ్రేడ్లు, నిద్రలేమి, భయము, అపజయ భయం వంటి ప్రశ్నలకు, “కాలసరణిని  సక్రమంగా ఉపయోగించుకోవడం, పరీక్షలో విశ్వాసంతో,ఉత్సాహం తో పాల్గొనడం, అధిక ఒత్తిడిని  పెట్టుకోకుండా టైమ్ టేబుల్ ను  అనుసరించడం వల్ల వీటి నుండి బయట పడవచ్చున”ని సమాధానం  ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల వల్ల జగిగే నష్టం, దురుపయోగం గూర్చి మాట్లాడుతూ, సమస్య మాధ్యమం కాదని , ఏకాగ్రత, విశ్వాసం, సమయ పాలన  ప్రధానమని మరియు ఆన్ లైన్ —-పానేకే లియే , ఆఫ్ లైన్ —— బన్ నే కే లియే”అని తెలిపారు.  అదే విధంగా ఆన్ లైన్ లో పొందిన జ్ఞానాన్ని సాంకేతికనైపుణ్యాన్ని  ఆఫ్ లైన్ లో ఉపయోగించుకోవాలని తెలిపారు.

విద్యార్థులు సమయాన్ని సోషల్ మీడియా ద్వారా పొందే ఆనందానికి పరిమితం చేయక కష్ట పడితే విజయం సాధ్య మేనని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులసహకారంతో నిర్మించుకున్న జాతీయ  విద్యా విధానం – నేషనల్ ఎడుకేషన్ పాలసి ద్వారా రానున్న  కాలంలో విద్యార్ధులు  మరింత లాభాన్ని  పొంద బోతున్నారని తెలిపారు. నూతన విద్యా విధానం విద్యార్థులయొక్క వైయుక్తిక ఆసక్తులను తీరుస్తుందని తెలిపారు. మరియు సమగ్ర వికాసాన్ని కలిగిస్తుందని తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లల యొక్కఆసక్తిని గమనించి ప్రోత్సహించాలని, వారి ఆలోచనలు పిల్లలపై రుద్దకూడదని తెలిపారు. విద్యార్థులు తమ  కలలను తాము సాకారం చేసుకోడానికి  తమలోని ప్రతిభను తామే గుర్తించుకొని తగిన విధంగా  తగిన విధంగా సంసిద్ధపరుచుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ
nav1 బాలహీనతలను తాము గుర్తించి వాటిని బలంగా మార్చుకోవాలని తెలిపారు. పరీక్ష రాసేప్పుడు ప్రతివిద్యార్ధి సమయస్ఫూర్తి ప్రదర్శించాలని తెలిపారు. అదే విధంగా స్వీయ విశ్లేషణ, మనసుపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమం పూర్తి అయిన పిదప విద్యాలయ ఉప ప్రాచార్యులు, ఉపాధ్యాయులు విద్యార్ధులకు మరింత సమాచారం  అందించారు.

మరొక్క విశేషం ఏమిటంటే ఈ విద్యాలయ ప్రాచార్యలు డేనియల్ రత్నకుమార్ మరియు  పది మంది విద్యార్ధులు గవర్నర్ బంగ్లాలో జరిగిన ఇదే కార్యక్రమానికి అతిధులుగా హాజరు అయ్యారు.

LEAVE A RESPONSE