– కేంద్ర పథకాలను మావని చెప్పుకోవడానికి సిగ్గుండాలి
– కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకోవడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం
– బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ
కేంద్ర పథకాలకు బటన్ నొక్కడానికి సీఎం సిగ్గుందా అని బీజేపీ ఘూటుగా ప్రశ్నించింది. రైలు పేట లో బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు నివాసంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో…. జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ… కేంద్రం తరఫున మోదీ బెంగుళూరులో విడుదల చేసిన రైతు భరోసా మొత్తం 1000 కోట్లకు కేవలం 90 కోట్లు రాష్ట్ర ప్రబుత్వం తరఫున నిన్న ముఖ్యమంత్రి విడుదల చేయటాన్ని ఖండిస్తున్నాము.
దీనికై 15 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయటం హాస్యాస్పదం. జగన్ మోహనరెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 12500 గాను 7500 మాత్రమే ఇచ్చారు మిగిలిన 5000 వెంటనే ఇవ్వాలి . కేంద్రం ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలకు వైసిపి రంగులు వేసి, తామే ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం నిస్సుగ్గుగా చెప్పకుంటోంది. ఈ రైతుభరోసా కేంద్రాలను వైసిపి నాయకులు ధనవంతులు అవ్వటానికి వాడుకుంటున్నారు.
పలు పధకాలకు కేంద్రం ఇచ్చిన గ్రాంటును ప్రజలకు అందకుండా వైసిపి నాయకులు స్వాహా చేస్తున్నారు. అన్ని పధకాలకు వైసిపి స్టిక్కర్లు వేసుకోని, దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇ-క్రాప్ మేమే కడతామని రైతులను మోసం చేయటం వల్ల వారికి బీమా సోమ్ము రాకుండా నష్టపోయేలా చేశారు. రాష్ట్రంలోని 16 లక్షలమంది కౌలు రైతులలో కేవలం ఓకటిన్నర లక్షమందికి మాత్రమే మీరు రైతు భరోసా అందిస్తున్నారు. దోంగ బీమా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. తెనాలిలో ముఖ్యమంత్రి సభకు ఎన్నో సంవత్సరాలనుండి రైతులకు, హమాలీలకు ఆశ్రయమిస్తున్న చెట్లు కోట్టేయటం అమానుషం. ముఖ్యమంత్రి సభకు తెస్తున్న జనరేటర్ జారీ పడిన ప్రమాదంలో ప్రజలు మరణించిన పరిస్ధితులలో జి.వో నంబరు 1 పై ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయాలి.
బిజెపి సీనియర్ నాయకులు, లీగల్ సెల్ డిపార్ట్ మెంట్ ఇంచార్జ్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం అర్ధం ముఖ్యమంత్రికి తెలుసా. రాష్ట్రంలో శాంతిభద్రలు నాశనం చేస్తున్నందున రష్యాలో లాగే వైసిపి ప్రభుత్వం కూడా కుప్ప కూలిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపడటమే బిజెపి ప్రధాన సిధ్దాంతం. వార్డు సెక్రటేరియట్లు చట్ట విరుధ్దం. వాటికి చట్టపరంగా ఎటువంటి భద్రతా లేదు. ఈవిధానం రాజ్యాంగ వ్యతిరేకం. ఇటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలి. ఇంటింటికీ రేషన్ పంపిణీ అనేది జాతీయ విధానానికి వ్యతిరేకం. దీనిని ఉపసంహరించు కోవాలి.
విలేఖరుల సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కన్నా రవి దేవరాజ్, కిసాన్ మోర్చా మిర్చి సెల్ రాష్ట్ర కన్వీనర్ పాండురంగ విఠల్, మండల అధ్యక్షులు సురేష్ జైన్, పబ్లిసిటీ అండ్ లిటరేచర్ రాష్ట్ర కన్వీనర్ పాలపాటి రవికుమార్, వనమా నరేంద్ర, తాడువాయి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాస్కర్, కుమార్ గౌడ్, రంగా, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు భాష, జోనల్ ఇన్చార్జి నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు..