• అమరావతి రైతు ఉద్యమాన్ని“వెకిలి ఉద్యమం”గా అభివర్ణించడం సజ్జల అధికార మదానికి నిదర్శనం
• రాజధాని అమరావతిపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని చదవకుండా, వాస్తవాలు గ్రహించకుండా, తాడేపల్లి జీతగాడు బుద్ధిలేకుండా మాట్లాడాడు.
• దేవుడి స్క్రిప్ట్ ఎలాఉంటుందో 03వ తేదీన, 03వ నెలలో, ముగ్గురున్యాయమూర్తులు ముక్తకంఠంతో మూడు రాజధానులకు మంగళం పాడినప్పుడే ప్రజలు అర్థమైంది… సజ్జలకు అర్థంకాకపోతే ఎలా?
• ఒక బెయిల్ పై జీవిస్తున్న నాయకుడు జగన్ రెడ్డి సారధ్యంలో ఒక స్టేపై బతుకుతున్న సాక్షి మీడియాకు వత్తాసు పలికే నీకు ఇతర మీడియా సంస్థల గురించి, యాజమాన్యాల గురించి మాట్లాడే అర్హత ఉందా సజ్జలా?
• న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కృతజ్ఞతతో న్యాయమూర్తులకు, న్యాయదేవతకు రైతులు సాష్టాంగప్రమాణం చేయడాన్ని తప్పుపట్టిన సజ్జలకు , గతంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ న్యాయమూర్తులపై చేసిన దూషణలు గొప్పగా కనపడుతున్నాయా?
• టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ 307పేజీల సుదీర్ఘమైన తీర్పు వెలువరించిందని, దానిలో చాలాస్పష్టంగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హానరబుల్ జస్టిస్ సత్యనారాయణమూర్తి, సోమయాజులగార్లతో కూడిన త్రిసభ్యధర్మాసనం సదరు తీర్పుని వెల్లడించారు. దానిలో రాజధానిని తరలించే అవకాశంలేదని, రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, రాజధానిని తరలించే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పడం జరిగిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే!
రాజధానికి భూములిచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ విధానంలో వారికిఇస్తామన్నప్లాట్లను తక్షణమే అభివృద్ధిచేసి ఇ వ్వాలని, రాజధానిలో నిర్మించాల్సిన నిర్మాణాలు, ఇతరత్రా అభివృ ద్ధి కార్యక్రమాలను మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేయాలని న్యాయ స్థానం తేల్చిచెప్పింది. అలానే మరీ ముఖ్యంగా రాజధానికి రైతు లు ఇచ్చిన భూములను ఇతరఅవసరాలకు వినియోగించడానికి, తనఖా పెట్టడానికి ఎలాంటి అవకాశం ఈ ప్రభుత్వానికిలేదని, కేవ లం రాజధాని నిర్మాణానికే ఆభూములను వినియోగించాలని స్పష్టంచేసింది.
రైతులు వేసిన పిటిషన్లలోని అంశాలపై సుదీర్ఘమై న విచారణ జరిపిన అనంతరం రాష్ట్ర హైకోర్ట్ ఈ విధమైన తీర్పుని వెల్లడించింది. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన సీనియ ర్ న్యాయవాదులవాదనలు విన్నతరువాతనే న్యాయస్థానం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పుఇచ్చింది.
న్యాయస్థానం తీర్పువెలువడిన తర్వాత, కోట్లాదిమంది ప్రజలు పెద్దఎత్తున వారిఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. చాలాచోట్ల న్యాయ దేవతకు పాలాభిషేకాలుచేశారు. మరీ ముఖ్యంగా రాజధా ని రైతులు న్యాయదేవతకు సాష్టాంగప్రణామం చేశారు.ఇదంతాచూసి ఓర్వలేనికొందరుప్రబుద్ధులకు, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొన్నవారిలో కడుపుమంట మొదలైంది. ఆక్రమంలోనే తాడేపల్లి ప్యాలెస్ జీతగాడైన సజ్జల మీడియా ముందుకొచ్చి, న్యాయస్థానమిచ్చిన తీర్పుపై తన అక్కసంతా వెళ్లగక్కాడు.
అమరావతి ఉద్యమం 800రోజులకు పైబడి జరిగితే, దానిలో ఈ తాడేపల్లి పెదపాలేరుకి “వెకిలిచేష్టలు” కనిపించాయట… ప్రపంచం మెచ్చేలా రైతులు నానాఅవస్థలుపడి 800రోజులకు పైగా ఉద్య మంచేస్తే అది సజ్జలకు “వెకిలి”గా కనిపించిందంటేనే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 189మందికిపైగా తమప్రాణాలు అర్పించి మరీ చేసిన ఉద్యమం వెకిలిగా కనిపించిం దా అని తాడేపల్లి జీతగాడిని ప్రశ్నిస్తున్నాం.
ఈరోజు అధికార మదంతో ప్యాలెస్ జీతగాడు మాట్లాడాడు. ఉద్యమాలు, భూములుకోల్పోయిన వారి బాధ గురించి ఈ జీతగాడికి ఏం తెలుసును? ఏరోజైనా ఏ ఉద్యమంలో అయినా పాల్గొన్న అనుభవం సజ్జలకు ఉందా? తను, తననాయకుడు ఎక్కడ, ఎన్ని ఉద్యమాలుచేశారో..ఎందరికి ఎలాంటి న్యాయం చేశారో సజ్జల సమాధానంచెప్పాలి.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని బ్రోకర్ పనులుచేయడం, వేలకోట్లు దిగమింగడంతప్ప మరోటి తెలియని సజ్జల, అమరావతి ఉద్యమా న్ని అవహేళన చేస్తాడా? బ్రోకర్ పనులు చేయడం తప్ప మరోటి తెలియని సజ్జలకు పవిత్రమైన అమరావతి ఉద్యమంలోని గొప్ప తనం ఏంతెలుస్తుంది? సజ్జల దగ్గర అవినీతి మురికికంపు తప్ప చెప్పుకోవడానికి ఏమైనా ఉందా?
న్యాయస్థానం ముందు రైతులు సాష్టాంగప్రణామంచేసి, నమస్కారం పెట్టడం, న్యాయదేవతకు నమస్కారం పెట్టడం తప్ప న్నట్లు జీతగాడు మాట్లాడాడు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా జీతగాడిలోని గ్యాస్ తన్నుకుంటూ బయటకువస్తోంది. ఓర్చుకోలేనంత కడుపుమంట కదా.. ఆపాలన్న ఆగడంలేదు మరి.
రైతులు తమకు న్యాయం దక్కిందన్న సంతోషంలో న్యాయదేవతకు మోకరిల్లడం తప్పా? మీ నాయకుడి లాంటి రాక్షసుడి బారినుంచి రాజధానిని, రైతులను కాపాడినందుకు న్యాయస్థానానికి నమస్కారం పెట్టుకోవడం తప్పెలా అవుతుంది సజ్జలా? రైతుల్లాగా నమస్కారాలు పెట్టకుండా.. మీ పేటీఎమ్ కుక్కల్లాగా న్యాయ స్థానాలను, న్యాయమూర్తులను దూషించాలా సజ్జలా? అసభ్య పదజాలంతో నీ పార్టీ నాయకులు న్యాయమూర్తులను దూషించిన రోజున బయటకు వచ్చి ఖండించని నువ్వు ఈరోజు మాకు వ్యవస్థల గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆరోజున నీ మౌనం న్యాయమూర్తులను దూషించడాన్ని సమర్థించినట్లు కాదా? అటువంటి నీదగ్గర నుండి న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ఏరకంగా గౌరవించాలో తెలుసుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు.
మీపార్టీలో పనిచేసే పేటీఎమ్ కుక్కలను సీబీఐ వాళ్లు దేనికి అరెస్ట్ చేస్తున్నారో సమాధానంచెప్పు సజ్జలా? న్యాయమూర్తులను దూషించినందుకుకాదా? అలాంటివారిని పెంచిపోషిస్తున్న నీలాం టివారు న్యాయమూర్తుల గురించి, వారిచ్చిన తీర్పుల గురించి మాట్లాడితే ఎలా? అమరావతిలో ఇప్పటికీ అంతాగ్రాఫిక్సే నంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు సజ్జల. ఆయన ముందు చదవాల్సింది అమరావతిపై న్యాయస్థానంఇచ్చిన 307పేజీల సుదీర్ఘతీర్పుని. అదికాకుండా తనచెంచాలురాసిచ్చే కాగితాలను చదివితే వాస్తవా లు ఎలాతెలుస్తాయి?
సాక్షిపత్రికు ఎలాగు వాస్తవాలు నిజాలుచెప్పడం చేతగాదు. మిగ తా పత్రికలు ప్రజలకోసంపనిచేస్తూ వారితరుపున వాస్తవాలు తెలి యచేస్తుంటే వాటిపై దుమ్మెత్తిపోస్తున్నాడు ఈ జీతగాడు. పకోడి పేపర్ సాక్షిలాగా అన్ని అసత్యాలు రాస్తూ కేంద్ర హోంశాఖ ద్వారా లైసెన్సు రెన్యువల్ కూడా పొందలేక నేడు తెలంగాణా హైకోర్టు ఇచ్చిన స్టేపై ఆధారంగా బతకాల్సిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో మరే మీడియాకు లేదు.
సిగ్గులేకుండా సాక్షి నేడు హైకోర్ట్ ఇచ్చిన స్టేపై బతుకుతోంది. కేంద్రహోంశాఖ సాక్షి మీడియా లైసెన్స్ రెన్యువ ల్ చేయకుండా ఎందుకునిరాకరించిందో సజ్జలచెప్పాలి. దానిపై సజ్జల తెలంగాణహైకోర్టుకివెళ్లి స్టే తెచ్చుకున్నాడా లేదా? సాక్షి మీడియా స్టేపై బతుకుతుంటే, మీ నాయకుడేమో బెయిల్ పై బతు కుతున్నాడు.. అదీ మీబతుకు. అలాంటి మీరు ఆంధ్రజ్యోతి గురించి, ఈనాడు గురించి, రాధాకృష్ణ, రామోజీరావు గార్ల గురించి మాట్లాడితే ఎలా సజ్జలా? సాక్షి మీడియా “స్టేక్షి” మీడియా అయిందని తెలుసుకోవయ్యా. మీనాయకుడి బ్రతుకు బెయిల్ పై ఆధారప డిఉందని గుర్తుంచుకోవయ్యా సజ్జలా?
హైకోర్ట్ తీర్పులోని పేజీనెంబర్ 178లో చాలా స్పష్టంగా అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటివరకు చేసిన మొత్తం ఖర్చు రూ.15వేల కోట్ల రూపాయలని, దానిలో నిర్మాణ పనులకు సంబంధించి చేసిన ఖర్చు రూ.5674కోట్లని, చేసిన పనులకు ఇంకాచెల్లించాల్సిన మొత్తం రూ.1850కోట్లని, వివిధ పనులకు సంబంధించి మొబిలైజ్ అడ్వాన్సులకింద రూ.5,200కోట్లుఇచ్చారని హైకోర్ట్ తీర్పులో చాలా స్పష్టంగాఉంది.
అలానే రైతులకు ఇప్పటివరకు చెల్లించింది రూ.800కోట్లని, చెల్లించాల్సింది రూ.1100కోట్లని కూడా ఉంది. రైతులకు పెన్షన్లరూపంలో ఇచ్చింది రూ.290కోట్లు అయితే, ఇంకా చెల్లించాల్సింది రూ.290కోట్లని మొత్తం కలిపి రూ.15వేలకోట్ల వరకు ఖర్చయిందని రాష్ట్ర హైకోర్ట్ చాలాచాలా స్పష్టంగా చెప్పింది . అంత స్పష్టంగా హైకోర్ట్ జరిగినదానిగురించి చెప్పాక కూడా సజ్జ ల సిగ్గులేకుండా వర్చువల్ గ్రాఫిక్స్ అంటున్నాడు.
న్యాయస్థానంలో మీరు నియమించిన లాయర్లు ఎందుకు ఆలెక్కలన్నీ తప్పు అనిచెప్పలేకపోయారు? దిగ్రేట్ అడ్వకేట్ జనరల్, మరయు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సహా అందరూ అమరావతిలో ఏంలేదు సార్..అంతా గ్రాఫిక్స్ అని ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ల నోరుపడి పోయిందా?
రైతులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని, మోతుబరులని కూడా సజ్జల చెప్పాడు. 10వేలఎకరాలభూమి 1100మంది చేతుల్లో ఉందని కూడా తప్పుడు లెక్కలు చెప్పాడు. హైకోర్ట్ తీర్పులోని పేజీనెం 178లో ఎకరం కంటే తక్కువ ఉన్నరైతులు రాజధానిలో 20,422 మందివరకు ఉన్నారని న్యాయస్థానంచెప్పింది. ఎకరంకంటేతక్కువ ఉన్న రైతుల 10వేలఎకరాలకు పైగా భూమిని రాజధానికి ఇచ్చారు. అంటే 30శాతం భూమి అలాంటి పేద దళిత రైతులు ఇచ్చిందే. అలానే ఎకరంనుంచి 2.50ఎకరాల భూమి ఉన్నరైతులు 6,278 మంది ఉన్నారని, వారు ఇచ్చిన భూమి 9,780ఎకరాల వరకు ఉందని కూడా న్యాయస్థానం చెప్పింది.
మొత్తం రాజధానికి 29,750 మంది రైతులు భూములు ఇస్తే, వారిలో ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకుఉన్నవారే 27వేలమంది వరకు ఉన్నారు. వారంతా పేదరైతులే. వారిలో దళితులే అధికంగాఉన్నారు. ఇవేవీ సజ్జలకు తెలియవా?…లేక తెలియనట్లు నటిస్తూ దొంగలెక్కలు చెబుతూ మోతుబరి రైతులంటాడా? ఎకరం కంటే తక్కువ, 2.5ఎకరాల కంటే తక్కువ ఉన్న పేదరైతులే రాజధానికి ఇచ్చిన భూమిలో 60 శాతం వరకు భూమి ఇచ్చారు. వారికి అయిదెకరాల లోపు ఉన్న రైతులను కూడా కలిపితే మొత్తం భూమిలో దాదాపు 83శాతం భూమి రాజధాని అవసరాలకు ఇచ్చారు. వారంతా స్వచ్ఛందంగా రాష్ట్రంకోసం తమ భూములను త్యాగంచేసి, దేవుడా ఏమిటీ మాకీ ఖర్మఅంటూ 800రోజులకు పైగా రోడ్లపైధర్నాలు చేస్తుంటే, అవన్నీ ఈ సజ్జలకు వెకిలి చేష్టల్లా కనిపించాయి.
అచ్చెన్నాయుడు పార్టీ విజయంపై అన్న మాటలకు సజ్జలకు ఎందుకు అంతబాధ? వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160కు పైగా స్థానాలు వస్తాయనే విశ్వాసం మాకుంది.. ఆ విశ్వాసం తోనే టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు 160కుపైగా స్థానాలు వస్తాయని చెప్పారు. ఆయన చెప్పిన దానిపై నీకెందుకు అంత కడుపుమంట సజ్జల? వచ్చే ఎన్నికల్లో నీ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయబోతున్నారన్న ఆక్రోశంతో మతిభ్రమించి మాట్లాడుతున్నావు.
ఈ సంవత్సరం 03వనెల అయిన మార్చిలో 03వతేదీన 03 (ముగ్గురు) న్యాయమూర్తుల ధర్మాసనం 03 (మూడు రాజధానుల) నిర్ణయం సరైంది కాదని ముక్త కంఠంతో తేల్చి చెప్పారు సజ్జలా? 03-03-03-03 అదీ నిజమైన దేవుడి స్క్రిప్ట్ అంటే. అలాంటి స్క్రిప్ట్ లు ఇంకా ముందుముందు చాలాచూడాలి సజ్జలా.. గుర్తుంచుకో.
ఇంకా ఏంచెప్పావయ్యా సజ్జలా. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నారా? నువ్వుచెప్పిన ఉత్తరాంద్ర,రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక్క ఉద్యోగం అదనంగా కల్పించారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చారా? మీ ముఖాలకు ఈమూడేళ్లలో ఉత్తరాంధ్రలో ఏంచేశారో..రాయలసీమకు ఏం ఒరగబెట్టారో చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. ఎందుక య్యా సజ్జలా ఊరికో నోరుంది కదా అని మాట్లాడితే సరిపోతుందా?
టీడీపీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర, రాయలసీమప్రాంతాలకుతామేం చేశామో ఆధారాలతో సహాకళ్లకు కట్టినట్టు చెప్పగలం.. ఈ మూడేళ్లలో మీప్రభుత్వం ఏంచేసిందో నిన్న గంటసేపు మీడియాతో మాట్లాడిన నువ్వు ఒక్క అంశం కూడా చెప్పలేకపోయినందుకు సిగ్గుపడాలి సజ్జలా ?
హైకోర్ట్ తీర్పులోని పేజీ నెం 173, పేరాగ్రాఫ్ నెం-265లో “Failure discharge its duties and obligations both by state and APCRDA at their whim, stoppage of development, failure to complete the land pooling scheme process is fraud on power” అని స్పష్టంగా పేర్కొన్నారు.
దాని అర్థం ప్రభుత్వం మరియు ఎపి సిఆర్ డిఎ రాజధాని భూముల అభివృద్ధికి సంబంధించి తమ బాధ్యతలు నిర్వర్తించడంలో వైఫల్యం చెందడం పచ్చి మోసం. ఆ విధంగా మీ ప్రభుత్వం పచ్చి దగా చేసిందని కూడా న్యాయస్థానం చెప్పింది. దానికి సజ్జల ఏంసమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం.
రాజధాని నిర్మాణ వ్యయం గురించి అవాస్తవాలు మాట్లాడిన సజ్జల నిధుల లభ్యత గురించి హైకోర్టు తీర్పులో పేజి నెం.188, పేరాగ్రాఫ్ నెం.292లో ఏంచెప్పిందో చదవాలి. గత ప్రభుత్వం అనేకసందర్భాల్లో అమరావతి నిర్మాణానికి సంబంధించి విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఏముందో కూడా న్యాయ స్థానం చెప్పింది. మార్చి 2016, మార్చి 2017, డిసెంబర్ 2017, ఏప్రియల్ 2018, ఫిబ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై 5సార్లు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ సహా, చేసిన ఖర్చులు మొత్తం వివరాలను వాటిలో ప్రస్తావించారు.
అలానే ఆయా శ్వేతపత్రాల్లో నిధుల సమీకరణ ఎలాచేయాలో కూడా గత ప్రభుత్వం వివరంగా చెప్పింది. వాటిగురించి ప్రస్తావించిన న్యాయస్థానం ఆ అవకా శాలను ఈ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోలేక పోతోందని కూడా ప్రశ్నించింది. గత ప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రాల్లో నిధులసమీకరణకుఉన్న మార్గాలేమిటో..అందుకోసం ఎలాంటి విధానాలు అవలంభించాలనేదికూడా ఆయాశ్వేతపత్రాల్లో ఉన్నట్లు హైకోర్ట్ చెప్పింది. అందువల్ల నిధుల కొరత అనేమాట చెప్పి తప్పిం చుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అవకాశంలేదని కూడా న్యాయస్థానం స్పష్టంచేసింది. అమరావతి ద్వారా సృష్టించిన సంప దతోనే రాజధానినిర్మాణంచేపట్టవచ్చని, తద్వారా రాష్ట్రాన్ని అభివృ ద్ధిచేయొచ్చని గతంలో చంద్రబాబు చాలాసార్లు చెప్పారు.
టీడీపీ అధినేత చెప్పినమాటల్లోని అంతరార్థాన్నే న్యాయస్థానంకూడా తన తీర్పులో ప్రస్థావించింది. అదేమీ సజ్జలకు కనిపించలేదు.మరో పక్క పేదలగురించి ఈ సజ్జల మొసలికన్నీరు కారుస్తున్నాడు. రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించి, అంతా సిద్ధమైన 5వేల పక్కాగృహాలను పేదలకు ఇవ్వకుండా ఈప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో సజ్జల చెప్పగలడా? నిజంగా ఆయనకు, ఆయన ప్రభు త్వానికి రాజధానిలోని పేదలపై అంతటిప్రేమే ఉంటే తక్షణమే టీడీ పీ హాయాంలో నిర్మించిన 5వేలపక్కా గృహాలను వారికి కేటాయించాలి.
పచ్చని పంటపొలాలను ధ్వంసం చేసి రాజధానిని నిర్మిస్తున్నారని మాట్లాడుతున్న సజ్జలకు పేదవాడి పక్కాగృహాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అదే పేదలకు చెందిన వేల ఎకరాల పచ్చని పంట పొలాలు ధ్వంసం చేసిన మీ సర్కారు నిర్వాకం గుర్తుకు రాలేదా?
పదేపదే అమరావతి రాజధాని నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, కోట్లరూపాయలు దిగమింగారని టిడిపిపై నిరాధారమైన ఆరోపణలు చేసే సజ్జల గత మూడు సంవత్సరాల కాలంలో టిడిపి అవినీతిని బయటకు లాగుతాం అని ఏర్పాటుచేసిన సిట్ లు ఏంసాధించాయో సమాధానం చెప్పాలి. అమరావతిలో పైసాకూడా అవినీతి జరిగిందని నేటివరకు నిరూపించలేని మీరు ఇంకా ఎన్నిరోజులు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తారు?
అమరావతిని నిర్మించడం ఇంత కష్టంతో కూడుకున్నది అని తెలియక .. జగన్మోహన్ రెడ్డి రాజధానికి మద్ధతిచ్చాడని సజ్జల చెబుతు న్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియని అమాయకుడని సజ్జల చెబితే ప్రజలునమ్మాలా? వివేకానందరెడ్డి హత్యజరిగినప్పుడు అవినాశ్ రెడ్డి ఏంచేశాడో తెలియకనే గతంలోకూడా జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరాడా? తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక తన బాబాయ్ హత్యవెనుక అవినాష్ రెడ్డి పాత్ర, తన పాత్ర గుర్తుకు వచ్చి సిబిఐ విచారణ వద్దన్నాడా సజ్జలా? ఎందుకు ఇలాంటి కట్టుకథలు చెబుతావు? ఇంకెన్నాళ్లు నువ్వు, మీ నాయకుడు ప్రజల్ని నమ్మించి మోసగించాలని చూస్తారు?
అమరావతిపై ఇంకోరూపంలో బిల్లులు తెస్తామని కూడా సజ్జల చెబుతున్నాడు. హైకోర్ట్ తీర్పులోని పేజీనెం-292లో ఏముందో తెలుసుకో సజ్జలా? ఊరికే నోరుందికదా అని బుధ్ధిలేకుండా మాట్లాడితే ఎలా? పేజీనెం- 291, 292 లోని పేరా గ్రాఫ్ నెంబర్ 492, 493లో గతంలో సుప్రీం కోర్టు మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజధానిలో భాగమైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ ఆర్గాన్స్ ఏర్పాటు నిర్ణయం పూర్తిగా పార్లమెంటు పరిధిలోకే వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో మన రాష్ట్ర రాజధాని ఏర్పాటు నిర్ణయం కూడా పార్లమెంటు ద్వారా రూపొందించిన విభజన చట్టం ఆధారంగా ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిఫారసు ద్వారా జరిగింది.
నేడు ఈ ప్రభుత్వం రాజధాని విషయంగా ఏంచేయాలన్నా తిరిగి పార్లమెంట్ ద్వారానే చేయాలి తప్పితే మరో మార్గం లేదు. అదికాదని ఈ ప్రభుత్వం తాను అనుకున్నదే చేయాలని భావిస్తే అది కోర్టు ధిక్కరణే అవు తుంది. కోర్టు ధిక్కరణతో పాటు నేడు అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక దైవసంకల్పమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దైవసంకల్పానికి విరుద్దంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరించడం మానుకుంటే మంచిది. దైవసంకల్పానికి ఎదురువెళితే గతంలో ఏంజరిగిందో, దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో ఈ ముఖ్యమంత్రికి బాగా తెలుసు.
కాబట్టి ఈముఖ్యమంత్రి, ఆయన పాలేరు సజ్జల ఇప్పటికైనా భేషజాలు, పట్టింపులకు పోకుండా ప్రజారాజధానిని అభివృద్ధిచేయాలని కోరుతున్నాం. అలా కాకుండా కడుపుమంటతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే వారేనష్టపో తారనికూడా తేల్చిచెబుతున్నాం. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని టీడీపీ స్వాగతించింది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యేవరకు కూడా టిడిపి కంకణబద్దమై ఉంటుంది.