రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి న్యాయస్థానాలను తప్పుదారి పట్టించడం సిగ్గుచేటు

– సొంత కంపెనీ సరస్వతీ పవర్ కు దోచిపెట్టడం కోసం కుమ్మక్కై న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించిన ఘనుడు జగన్ రెడ్డి
– కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులకు విరుద్ధంగా సరస్వతీ పవర్ కు రెండింతలు నీటిని కేటాయించుకున్న నీటి దొంగ జగన్ రెడ్డి
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

సరస్వతీ పవర్ కు సున్నపురాయి గనుల లీజుకు సంబంధించిన వ్యవహారంలో పిటీషనర్, ప్రభుత్వం కుమ్మక్కై న్యాయవ్యవస్థను బాధితురాలిని చేయడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెందిన సరస్వతీ పవర్ సున్నపురాయి గనుల అనుమతుల కోసం పాల్పడిన అవకతవకతలపై మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ఆయన మాట్లాడుతూ….. జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తేది. 18.05.2009 న జీ.వో నం. 107 తో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లోని తంగెడ, వేమవరం, చెన్నాయపాళెం గ్రామాలలో సున్నపురాయి గనులు అనుమతులు తెచ్చుకున్నారు.

కొడుకు కోసం వైఎస్ కొన్ని వందల ఎకరాల్లోని సున్నపురాయి గనులను రూల్స్ కి విరుద్దంగా కట్టబెట్టాడు. కానీ, మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించకపోవడంతో 613.4 ఎకరాలలో సున్నపురాయి లీజు అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలంటూ నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరస్వతీ పవర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అటు తర్వాత 09.10.2014 న జీ.వో నం.98 ద్వారా ఆ లీజును రద్దు చేయడం జరిగింది. లీజు రద్దుపై సరస్వతీ పవర్ కంపెనీ రిట్ పిటీషన్ నం. 33420/2014 తో హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత 15.10.2019 న గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ శ్యామ్ ప్రసాద్ గారు ఫైనల్ తీర్పు ఇచ్చారు.

ఈ రోజు గౌరవ హైకోర్టు ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేసిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇందులో పిటీషనర్ జగన్ రెడ్డి గారి కంపెనీ, రెస్సాడెంట్ జగన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం. కాబట్టి పిటీషనర్, రెస్పాండెంట్ ఇద్దరు కుమ్మక్కై సరస్వతీ సిమెంట్స్ కు కావాల్సిన సున్నపురాయి గనుల అనుమతులకు సంబంధించి అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై విచారణ సంధర్బంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సి.ఎం జగన్ రెడ్డి తన సొంత కంపెనీ ప్రయోజనాల కోసం గౌరవ న్యాయస్థానాన్ని ఏ విధంగా తప్పదారి పట్టించాడో ప్రజల ముందుంచాలని అనుకుంటున్నాను.

మినరల్ కన్సెషన్ రూల్స్ – 1960 లోని 28(1) (2) లను ఆధారం చేసుకుని సరస్వతీ పవర్స్ కు సున్నపురాయి గనులు రద్దు చేయడం జరిగింది. ఈ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రైవేటు భూములకు వర్తంచవని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. The lands in respect of which the mining lease is granted are private lands. Therefore, the procedure contemplated under chapter 5 of mining lease in respected of lands which vests with the government do not apply. సరస్వతీ పవర్ కు లీజుకిచ్చిన భూములన్నీ ప్రైవేటు భూములని, ప్రభుత్వ భూములకు వర్తించే మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రైవేటు భూములకు వర్తంచవు కాబట్టి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, లీజును రద్దు చేయడం తప్పని పిటీషనర్ తరపు న్యాయవాది రవిచంద్ర వాదించారు. ప్రభుత్వం తరపున రెస్సాడెంట్ అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ…Chapter 5 of mineral concession rules are only applicable to government lands and not in respect of private lands. Therefore, the issuance of notice not applicable… అంటూ చాలా చక్కగా పిటీషనర్ వాదనను సమర్ధించారు.

పిటిషనర్ వాదనలకు చెక్కభజన చేయడానికా ప్రభుత్వ అడ్వకట్ జనరల్ ఉంది? గంగిరెద్దులా పిటీషనర్ లాయర్ చెప్పిన మాటలకు తలూపుతూ సమర్ధించడం అంటే పిటీషనర్, రెస్పాడెంట్ కుమ్మక్కైనట్లు కాదా? పిటీషనర్ లాయర్ చెబుతున్న విషయాలు వాస్తవమే అని రెస్పాండెంట్ లాయర్ కూడా చెబుతుంటే కోర్టు మాత్రం ఏం చేయగలదు. రెస్పాండెంట్ వాదన విన్న గౌరవ హైకోర్టు కూడా మైనింగ్ గనుల లీజును రద్దు చేయడం కరెక్టు కాదని లీజును పునరుద్దరించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. సరస్వతీ పవర్ కు చెందిన భూముల లీజు వ్యవహారంలో పిటీషనర్, రెస్సాండెంట్ కుమ్మక్కయ్యారు కాబట్టే న్యాయవ్యవస్థను బాధితురాలిని చేశారని గౌరవ హైకోర్లు వ్యాఖ్యానించింది.

ఏ పరిశ్రమ పెట్టాలన్నా కేంద్రం ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. పర్యవరణ అనుమతుల కోసం 29.03.2012 న సరస్వతీ పవర్ పెట్టుకున్న ఫాం 1 లో ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉన్నాయో తెలియజేశారు. ఇందులో సరస్వతీ పవర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఏంటంటే….Total Area of the mine is 613 hectors అని చెప్పారు. ఇందులో 10.028 (దాదాపు 25 ఎకరాల) హెక్టార్ల ప్రభుత్వ భూమి ఉందని తాటికాయంత అక్షరాలతో రాశారు.. పర్యావరణ అనుమతుల కోసం ఒకలా, లీజు అనుమతుల కోసం మరోలా వాస్తవాలను వక్రీకరించి చెప్పడం మోసం కాదా? మినరల్ కన్సెషన్ రూల్స్ వర్తించవని నిస్సిగ్గుగా గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించిన వాళ్లను ఏం చేయాలి? అత్యంత జుగుప్సాకరంగా సొంత కంపెనీకి అయాచితంగా దోచిపెట్టడం కోసం అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించాడు.

ఇలాంటి 420 పనులు చేసేందుకు ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ న్యాయస్థానాలను తప్పుదారి పట్టించడం క్షమించరాని నేరం. ఇందువల్లే గౌరవ హైకోర్టు ఇది కుమ్మక్కు అని వ్యాఖ్యానించింది. దీనిపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు. 420 పనులు చేస్తూ విశ్వసనీయత గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇదేనా విశ్వసనీయత అంటే? జగన్ రెడ్డికి లేనిదే విశ్వసనీయ అని ప్రజలు అర్ధంచేసుకోవాలి. భవిష్యత్తులో ఆ పదం వాడే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు.

కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ 2012 లో సరస్వతీ పవర్ కు ఇచ్చిన అనుమతుల్లో ఎంత నీటిని వినియోగించుకోవచ్చన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా రాశారు. Total water requirement for the proposed project shall not exceed 2855 MQ నీటికి అనుమతించారు. అనగా ఏడాదికి 0.036 టి.ఎం.సీ నీరు మాత్రమే ఉపయోగించుకోవాలని చెబితే 0.068 టి.ఎం.సీ ల నీటిని కేటాయిస్తూ తేది. 03.12.2019 న జి.వో. నం. 81 ను జారీ చేశారు. పర్యవరణ శాఖ అనుమతించిన దానికంటే రెండింతలు నీరు సరస్వతీ పవర్ కు ఏ విధంగా కేటాయించాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఓ వైపు రైతులు నీరు లేక పంటలు ఎండబెట్టుకుంటుంటే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కి సొంత సిమెంట్ కంపెనీకి దోచ్చిపెట్టాడు. జగన్ రెడ్డి చేసే దగుల్బాజీ పనుల వల్లే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

అది చాలదన్నట్లు 15-05-2020న జీవో నెం.16 ఇచ్చారు. ముందుగానే ఐదేళ్లకు నీటిని కేటాయించి, తర్వాత మార్చేశారు. 0.0689 టీఎంసీల నీటిని జీవితకాలం సరస్వతి ఇండస్ట్రీస్ కు కేటాయించుకున్నారు. ముందు 5 ఏళ్లకు నీళ్లను రెండింతలు కేటాయించుకుని, తర్వాత లైఫ్ టైమ్ దోచేసుకుంటారా? జీవో నెం.16 ఎలా ఇస్తారు? జీవితకాలానికి ఎలా ఇస్తారు? నీ సిమెంట్ కంపెనీ కోసం ఇన్ని తప్పుడు పనులు చేస్తావా? జగన్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. హైకోర్టును తప్పుదారి పట్టించారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఏర్పాటుచేసి.. తనకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు లేవని పచ్చి అబద్ధం ఆడించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సిగ్గుపడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినందుకు. తక్షణమే ఆయన రాజీనామా చేయాలి.

తాడేపల్లి ప్యాలెస్ దొర ఆడమన్నట్లు గంగిరెద్దులా ఆడుతున్నారు. రికార్డ్స్ చెక్ చేయకుండా ప్రభుత్వ భూమి లేదని, సరస్వతి సిమెంట్స్ లాయర్ చెప్పింది నిజమని ఎలా వాదిస్తారు? ఇసుక, మైనింగ్, లిక్కర్.. ఇప్పుడు నీటి దోపిడీ. కడప జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే లు ప్రకటిస్తున్నారు. జగన్ రెడ్డి మాత్రం కేటాయింపుల కంటే రెండింతలు, జీవితకాలం నీటిని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి సొంత వ్యాపారాల కోసం తప్పుడు పనులు చేస్తున్నారు. గౌరవ న్యాయస్థానం అందుకే ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కోర్టునే విక్టిమ్ గా మార్చారు. దీనిని ప్రజలు గమనించాలి. వీటన్నింటిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా వద్ద ఆధారాలతో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తాం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్ రెడ్డి ఏవిధంగా హైకోర్టును తప్పుదారి పట్టించారో తేలుస్తాం.

Leave a Reply