Suryaa.co.in

Andhra Pradesh Telangana

పవన్ పెద్ద మనసు!

– వరద బాధితులకు రూ. 6 కోట్ల విరాళం

విజయవాడ: వరద బాధితుల సహాయార్థం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ రూ.6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన పవన్ కల్యాణ్‌ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించనున్నారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ. 4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.

మొత్తంగా, పవన్ కల్యాణ్‌ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

LEAVE A RESPONSE