ఆర్.టి.ఐ చట్టాన్ని తుంగలో త్రొక్కేలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
• సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ డిపార్ట్ మెంట్ సమాచారాన్నిపబ్లిక్ డొమైన్ లో ఉంచాలి.
• కానీ, చాలా ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు తమ వెబ్ సైట్లలో తాజా సమాచారం ఉంచడం లేదు.
• దీనిపై అనేకమార్లు పిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం మారడం లేదు.
• ఆర్.టి.ఐ పై గౌరవ హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు.
• ఈ సమస్యపై తమరు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ వెబ్ సైట్ లను అప్ డేట్ చేసేలా చర్యలు తీసుకోండి.
• రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కేంద్ర సమాచార హక్కు చట్టాన్ని అమలయ్యేలా చూడండి.
• సమస్యపై తమరు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారాని భావిస్తున్నాను.