– గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు
– రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం
– పథకాలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలం మసీదు గూడెంలో ప్రజా పాలన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి ఏమన్నారంటే.. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించాం. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తాం అన్నారు. గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను ఎమ్మెల్యే నిర్బొహమాటంగా వెల్లడించిన వైనం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.