– డిప్యూటీ స్పీకర్
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత శరవేగంగా జరుగుతున్న పట్టణప్రగతిని ప్రజలు గమనించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నేతలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్పొరేటర్లు, పార్టీ నేతలు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారని అభినందించారు.
బౌద్దనగర్ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్ గురువారం పాల్గొన్నారు. అంబర్ నగర్, సంజయ్ గాంధి నగర్, ఈశ్వరి బాయి నగర్, వారసిగూడ, బాలవాడి స్కూల్, కౌసర్ మస్జీద్, మార్కండేయ టెంపుల్, వారసిగూడ బౌద్దనగర్ తదితర ప్రాంతాల్లో ఉప సభాపతి పద్మారావు గౌడ్ స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, నేతలు, అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బౌద్దనగర్ ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
వివిధ అభివృధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నామని తెలిపారు. బ్యాంక్ కాలనీ పార్క్ ను అభివృధి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా నాలా సమస్య, కౌసర్ మసీద్ సమీపంలో రోడ్డు సమస్యల పై స్థానికులతో వెంటనే సంప్రదించి, వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఉప కమీషనర్ శ్రీ దశరద్, జలమండలి జనరల్ మేనేజర్ శ్రీ రమణా రెడ్డి లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు దశరద్, ఆశలత, రమణా రెడ్డి, వై కృష్ణ, శ్రీమతి ప్రియాంక, , శశిధర్ ల తో పాటు తెరాస యువనేతలు కిశోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ , కంది నారాయణ తదితరులు పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా రూ. 31 లక్షల ఖర్చుతో నిర్మించిన కొత్త రహదారిని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు.