వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడులో నూజెండ్ల మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల్లో నాలుగేళ్లుగా మౌలిక సదుపాయాలు లేవు.
• సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
• కొత్త ఉప్పలపాడు గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టనట్టు ఉంటున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ముఖ్యమంత్రి జగన్ కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదు.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగు,తాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి.
• టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం.
• జగన్ సిఎం అయ్యాక టీడీపీ చేసిన ఖర్చులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు.
• ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వం రాజ్యమేలుతోంది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల సాగునీటి సమస్య పరిష్కరిస్తాం.