విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ నుండి వచ్చిన అలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని మంత్రి నారా లోకేష్ సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు మరియు ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు.
విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉండటానికి తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ముందుకు రావాలని, సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల కష్టాల్లో అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.