– ఎంపీ కేశినేని శివనాథ్
నందిగాం: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ గాంధీ సెంటర్ లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగిలా పనిచేస్తున్నారు.
నందిగామ నియోజకవర్గ ప్రజల కల వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి.. అందుకోసం కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే సౌమ్యకి, మంత్రి సత్య కుమార్ యాదవ్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో ఆయుష్ హాస్పిటల్ తో పాటు కేంద్రీయ విద్యాలయం కూడా వచ్చే విధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, నందిగామ నియోజకవర్గ పరిశీలకుడు బచ్చుల సుబ్రహ్మణ్యబోసు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరెంటెండెంట్ కేవీఎస్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు