– జిఎస్టి తగ్గింపుతో ట్రక్కులు, డెలివరీ వ్యాన్లు వంటి వాహనాల కొనుగోలు పై 28 శాతం వున్న జిఎస్టి 18 శాతానికి,తగ్గింది.
– ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఇన్స్యూరెన్స్ పై గతంలో వున్న 18 శాతం GSTని 05 శాతానికి తగ్గించారు.
– రవాణా ఖర్చులు కూడా తగ్గడంతో నిత్యావసర సరకుల ధరలు కూడా తగ్గుతాయి.
– బస్సులు, మినీ బస్సుల కొనుగోలు పై గతంలో 28శాతం వున్న జిఎస్టి 18 శాతానికి తగ్గడంతో ప్యాసింజర్ ట్రాన్స్ పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరిగింది.
– జిఎస్టి 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి వర్గాలు మరియు రైతులకు ఎంతో ప్రయోజనం.
– జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గడంతో వ్యాపారస్థులతో పాటు వినియోగదారులు కూడా సంతోషంగా వున్నారు.
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
బుచ్చిరెడ్డి పాళెం: జిఎస్టి 2.0 సంస్కరణలతో వస్తు రవాణాలో కీలక పాత్ర పోషించే వాహనాల కొనుగోలు మరియు మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గడంతో సరుకుల రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర సరకుల ధరలు ప్రజలకు అందుబాటులోనికి వస్తాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .
బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వినియోగ వస్తువుల ధరలు పెరగడం మరియు తగ్గడంలో రవాణా రంగం పాత్ర గురించి ఈ సందర్భంగా ఆమె గణాంకాలతో సహా వివరించారు.
కేవలం గూడ్స్ ట్రాన్ పోర్ట్ రంగమే కాకుండా బస్సులు, మినీ బస్సుల కొనుగోలు పై గతంలో 28శాతం వున్న జిఎస్టి 18 శాతానికి తగ్గడంతో ప్యాసింజర్ ట్రాన్స్ పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరిగిందన్నారు. జిఎస్టి 2.0 సంస్కరణలు లాజిస్టిక్ రంగానికి వరం లాంటివన్నారు జిఎస్టి 2.0 సంస్కరణలతో ట్రాక్టర్ల తగ్గడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.