Suryaa.co.in

Andhra Pradesh

బద్వేలు ఓటమి… బీజేపీ-టీడీపీ ఓటమి

– 90 వేలకు పైగా మెజార్టీ ఇచ్చిన బద్వేల్ ప్రజలకు కృతజ్ఞతలు
– వైయస్ఆర్సీపీకి పెరుగుతోన్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ తప్పుడు రాజకీయాలు
– ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను ఇప్పటికైనా బీజేపీ నెరవేర్చాలి
– వైయస్ఆర్సీపీకి ప్రజల మద్దతు ఉందని ఈర్ష్య పడేకంటే.. ప్రజల మనసులను ఎలా గెలవాలో ప్రతిపక్షాలు నేర్చుకోవాలి
– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్
గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఆచరిస్తుంది. బద్వేల్‌ ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధకి 90 వేలకు పైగా వచ్చిన భారీ మెజార్టీతో మా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో ఒకవైపు సంతోషపడుతూ మరోవైపు మరింత బాధ్యతగా మున్ముందు కూడా పనిచేస్తాం. బద్వేల్‌ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా మరింత బాధ్యతగా పని చేస్తాం.
బద్వేల్‌ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు పోటీ చేశాయి. బీజేపీ పైకి కనిపిస్తున్నా.. వెనకుండి కథ అంతా నడిపించింది తెలుగుదేశం పార్టీయే అనే విషయం అందరికీ తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలలో వైయస్సార్‌ సీపీకి ప్రజల ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఈ ఫలితాల ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగా చేరువ అవుతున్నాయనే విషయం స్పష్టం అవుతోంది. ఏదో విధంగా వ్యవస్థలను మేనేజ్‌ చేయాలనే ఉద్దేశం కొన్ని పార్టీలకు ఉంటే.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేవలం ప్రజలను మాత్రమే నమ‍్ముకుంటుంది.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వం ఏరకంగా సామాన్య ప్రజల్లోకి వెళ్లింది అనేదానికి బద్వేల్ ఉప ఎన్నిక మరో ఉదాహరణ. ఈ విజయం బడుగు, బలహీన వర్గాల విజయం. దళితుల విజయం, ప్రతి సామాన్యుడి విజయంగా భావించవచ్చు.
తెలుగుదేశం పార్టీ నిద్ర లేచినప్పటి నుంచి, ఏదో రకంగా ప్రభుత్వం మీద, పార్టీ పైనా బురదచల్లే ప్రయత్నం చేస్తోంది. ఓవైపు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ చేయడం లేదని చెబుతూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో బీజేపీకి పూర్తి సహకారం అందిస్తూ పూర్తిగా వారే కథ నడిపారు.
గుంటూరు, విజయవాడలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను విపరీతంగా చేశారు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోతే… వైయస్సార్‌ సీపీ చేసే అన్ని కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికినట్లే అని డైరెక్ట్‌ గా చెప్పిన చంద్రబాబు, ప్రజాతీర్పు తర్వాత మళ్లీ ఎదురు దాడికి దిగటం పరిపాటి అయిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తనకు తాను ఆలోచన చేసుకుంటే మంచిది.
ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే కార్యక్రమంలో భాగంలో ఈ ప్రభుత్వం కులాలు, మతాలు, పార్టీలు అన్నవి చూడకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. సంక్షేమ పథకాలకు కూడా క్యాలెండర్‌ ప్రకారం చెప్పిన సమయానికి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. రోజు రోజుకు వైయస్సార్‌ సీపీకి ప్రజల్లో ఆదరణ పెరగడం చూసి తట్టుకోలేక ఏదో తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా.. విభజన హామీలు నెరవేర్చకుండా, బద్వేల్‌ ఉప ఎన్నిక లో ఓట్ల రాజకీయం చేయాలని భంగపడింది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఈ ఫలితం తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు విషయంతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పి… ఇప్పటివరకూ అమలు చేయడంలో బీజేపీ జాప్యం చేస్తోంది.
విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలంటూ కేంద్రానికి ప్రతిసారి విజ్ఞప్తి చేయడంతోపాటు లేఖలు రాసిన మాట వాస్తవం కాదా? ప్రజల మనోభావాలను అనుగుణంగా మాకు ఇవ్వాల్సిన నిధులు, విధులు అమలు చేయాలని కోరుతున్నాం.
ప్రజల మనసును గెలవాలంటే చెప్పింది చేస్తేనే వారి మనసులు గెలవవచ్చు. ఎందుకు డిపాజిట్‌ కూడా కోల్పోయామనే బాధ కంటే ప్రజలు ఎందుకు తమకు మద్దతు ఇవ్వలేదనే విషయంలో దృష్టి పెట్టి, ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చితే బాగుటుందని బీజేపీ పెద్దలను కోరుతున్నాం.
రాజకీయ విమర్శలు, కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనేలా ప్రజల్లో అభద్రతను కలిగించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రను ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా తిప్పికొడుతున్నారు. ప్రజాతీర్పును చూసి అయినా ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది. బాబులా మేమేమీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలేదే? ప్రత్యేక హోదా వద్దు… ప్యాకేజీ ముద్దు అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.
పవన్‌ కల్యాణ్‌ కు.. జనాలను చూస్తే పూనకం వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడటం పరిపాటి అయిపోయింది. అరుపులు, కేకలు మీకు మాత్రమే పరిమితమా. మైక్‌ పట్టుకుని ఊగిపోతూ మాట్లాడటం కాదు… మీరు మాట్లాడేదాంట్లో క్లారిటీ ఉందో లేదో ముందుగా తెలుసుకోండి.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కార్మికులు అనునిత్యం పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుంటే… మీరు అక్కడకు వెళ్లి స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లో ఉందని మాట్లాడతారా.. ఒకపక్క బద్వేల్‌ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని పవన్‌ చెప్పారు. పదేపదే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకుంటూ, రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి వారి వద్ద నుంచి ఏమి వాగ్దానాలు తీసుకుంటున్నారో చెప్పాలి. మీరు చేయాల్సింది చేయకుండా, వైయస్సార్‌ సీపీని ఆడిపోసుకుంటున్నారే తప్ప, మీరు చేస్తున్న తప్పును సరిచూసుకోవాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైయస్సార్‌ సీపీ మొట్టమొదటే అఖిలపక్ష సమావేశం పెడతామని చెప్పడమే కాకుండా, పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా పార్లమెంట్‌లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ మా పార్టీ సభ్యులు ప్రతిరోజు నిలదీశారు. ఆ అంశాలు మీకు తెలియవా?
ఆంధ్రప్రదేశ్‌ గృహిణులు, ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు చెందిన మహిళలు బంగారం అమ్ముకోవడానికి ఇష్టపడరు. వాళ్ల మనసు ఒప్పుకోదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల యొక్క బంగారం అని.. ప్రైవేటీకరణపై ఒకసారి ఆలోచన చేయాలంటూ ఈ ప్రాంతానికే చెందిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేయడం పార్లమెంటులో ఆన్‌ రికార్డు ఉంది. మరి ఇవన్ని కనిపించలేదా పవన్ కల్యాణ్..?
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో వైయస్సార్‌ సీపీ గానీ, మా ప్రభుత్వంగానీ చేసిన తప్పేంటి? ప్రజలకు నిష్పక్షపాతంగా మేము చేస్తున్న సేవలు మీకు నచ్చడం లేదా? మా ప్రభుత్వం చేసే పాలసీలపై తప్పులు ఉంటే చెప్పాలని మేము అడిగినా నోరు విప్పరు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత… ఓటమిని జీర్ణించుకోలేక పైపెచ్చు ప్రజల మైండ్‌సెట్‌ తప్పు అంటూ మాట్లాడతారు. ప్రజలకు బుద్ధిలేదని ఆయన మాట్లాడుతున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దేవాలయాలు, చర్చిలను రాజకీయాల మధ్యకు తీసుకు వస్తున్నారు.
– బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత అయినా బురద చల్లే కార్యక్రమాలు ఇక మానుకుంటే మంచిది. ప్రజల మద్దతు ఉన్న వైయస్సార్‌ సీపీని చూసి ఈర్ష్యపడకుండా.. మీరు కూడా ప్రజాభిమానం పొందడానికి ప్రయత్నం చేయండి.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేస్తున్నా.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కి రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతుందేకానీ, అణువంతైనా తగ్గించలేరు అన్నది గుర్తెరగాలి. ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ప్రజా బలమే. అనునిత్యం రాష్ట్ర ప్రయోజనాలతో పాటు, ప్రజల సంక్షేమం కోసమే ఆయన ఆలోచిస్తూ పనిచేస్తున్నారు కాబట్టి, మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలను మా నుంచి దూరం చేయలేరు. జగన్‌కి క్రెడిబులిటీ ఉంది. చెప్పారంటే దాన్ని అమలు చేస్తారని ప్రజలు నమ్ముతారు. దాన్ని సంపాదించడం చాలా కష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు గొప్పది. దాన్ని గౌరవిస్తే మంచిదని ప్రతిపక్షాలను కోరుతున్నాం. – బద్వేలు ఉప ఎన్నికల్లో పొందిన ఓటమిని వేరేగా భావించకుండా, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను దయచేసి నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ఇచ్చిన ఈ తీర్పును స్పూర్తిగా తీసుకుని పనిచేస్తాం.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు మాట్లాడుతూ…
తిరుపతి ఉప ఎన్నిక తరహాలోనే.. బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి ఎక్కడా పాల్గొనలేదు. ఒక్క ప్రెస్‌మీట్‌గానీ, ప్రచారంగానీ చేయలేదు. ముఖ్యమంత్రి తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు. – ఆయన నమ్మకాన్ని ప్రజలు వొమ్ము చేయకుండా బద్వేలు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీని అందించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తోక మిత్రులు ప్రభుత్వంపై నిందలు వేసే కార్యక్రమాన్ని మానుకుంటే మంచిది. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను చంద్రబాబు హేళన చేయడం చూశారు కాబట్టే.. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు.

LEAVE A RESPONSE