-మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని
వైయస్ జగన్ అంటే తగ్గేదేలే..సోనియాకే భయపడలేదు..దుష్ట చతుష్టయానికి భయపడతారా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. దుష్టచతుష్టయం కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురిది కూడా మనోడు మాత్రమే అధికారంలో ఉండాలని ఉన్మాద ప్రయత్నం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు కూడా రోజూ విషపు రాతలు రాస్తున్నాయి.
రామోజీరావు నమ్మక ద్రోహి అని ఎన్‌టీఆర్ ఆనాడే అన్నారు. ఔటర్ రింగ్ కట్టానని చంద్రబాబు చెబుతారు. మరి భూసేకరణ వైఎస్సార్ ఎందుకు చేశారు?. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరు. డబ్బు కోసం రాధాకృష్ణ చేయని దుర్మార్గాలు లేవు. ఏపీలో కందిపప్పు రేటు ఎంత? తెలంగాణలో ఎంత? నీ హెరిటేజ్‌లోఎంత ఉంది?. ఆయిల్ ధరలు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి.
సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం జగన్‌కోసం పనిచేయాలి. ఇంటింటికి తిరగండి.. పథకాలు అందినవా.. లేదా ఆరా తీయాలన్నారు. పథకాలు రాకపోతే భాధ్యత వహించి సరిదిద్దాలన్నారు. అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పారు. ఎవరూ శాశ్వతం కాదు..జెండా మోసే కార్యకర్తలు శాశ్వతం.
సింగిల్‌గా రాలేమని చంద్రబాబు, పవన్‌కు తెలుసు.. అందుకే అందరూ కట్ట కట్టుకుని రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 మాసాలు జైల్లో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా? అంటూ పేర్ని నాని సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.