Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

– మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు

రాష్ట్రంలో పెసర పంటను పండించిన రైతులకు మద్దతు ధర లభించేవిధంగా మార్క్ ఫెడ్ ద్వారా రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, పెసర పంటను కొనుగోలు చేయాలని మంత్రి మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించడం జరిగింది.

ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాలలో పెసర పంట సాగయిందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని మంత్రిగారు తెలిపారు.

ప్రస్తుతానికి 12 ప్రాంతాలలో పంటకోతకు వచ్చిందని మరియు మార్కెట్ కు పెసర పంట అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్లు అధికారులు మంత్రిగారికి తెలియజేయగా, ఆ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటుచేసి, కొనుగోళ్ళును ప్రారంభించాలని ఆదేశించారు. రేపటి నుండి ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు సన్నాహాలు పూర్తి చేసుకోవల్సిందిగా ఆదేశించారు.

అదేవిధంగా కొనుగోలు సెంటర్లలో రైతులకు మార్క్ ఫెడ్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కనుక రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యత ప్రమాణాలను పాటించి పెసర పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,682 పొందవలసిందిగా మంత్రి విజ్ఙప్తి చేశారు.

LEAVE A RESPONSE