– స్టేట్ లోనే సర్వేపల్లి టాప్
– వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లిలో లెక్కకు మించి అరాచకాలు
– ప్రతి అర్జీని ఆన్ లైన్ లో నమోదు చేసి పరిష్కారానికి కృషి చేస్తున్నాం
– ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ముత్తుకూరు: మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో నాకు 2267 అర్జీలు వచ్చాయి. ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ లో రిజిస్టర్ చేస్తున్నాం…సమస్యల పరిష్కార ప్రక్రియను సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక అర్జీలు, ఫిర్యాదులు సర్వేపల్లి నియోజకవర్గంలోనే వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో 1000 అర్జీలతో ఆత్మకూరు ఉంది.
ముత్తుకూరు ప్రత్యేక గ్రీవెన్స్ తర్వాత సర్వేపల్లి ఎమ్మెల్యే లాగిన్ లో అర్జీల సంఖ్య 2500 దాటిపోతున్నాయి. కలెక్టర్ తో పాటు అధికారులకు వచ్చిన అర్జీలతో కలుపుకుంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 5333 అర్జీలు వచ్చి ఉన్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో భూసర్వే ప్రక్రియలో తప్పులతడకలు, పీఓటీతో పేరుతో దోపిడీ, జగనన్న కాలనీ పేరుతో అక్రమాలు, ఫ్రీహోల్డ్ పేరుతో మోసాలు..వీటన్నింటి ఫలితంగా అర్జీలు, ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
ఐదేళ్ల వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దుర్మార్గపు పాలన జరిగిందనేందుకు వేలాదిగా వస్తున్న ఈ అర్జీలే నిదర్శనం. ఇళ్ల స్థలాలు లేవని వందలాది అర్జీలు వస్తున్నాయి..అప్పటి ఎమ్మెల్యే కాకాణి ప్రజాసమస్యలను గాలికొదిలి దోపిడీకి పరిమితమయ్యాడు.
ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మంజూరు చేయడంతో పాటు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశాం. 150 గజాల(18 అంకణాలు) ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జీఓ ఎంఎస్ 30 ప్రకారం తహసీల్దార్లే పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
150 గజాల నుంచి 300 గజాలు(36 అంకణాలు) అయితే పట్టా మంజూరు అధికారాన్ని ఆర్డీఓకు ఇచ్చారు. 300 నుంచి 500 గజాల స్థలం అయితే కలెక్టర్ పట్టా మంజూరు చేస్తారు. ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామికీకరణ, జనాభా, కాలుష్యం పెరిగిన నేపథ్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. మత్స్య కళాశాలలో విద్యార్థులకు వసతుల కల్పనకు రూ.5.95 కోట్లతో ప్రతిపాదనలు పంపాం.