– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
– కుంభమేళాలో మంత్రి పవిత్ర స్నానం
144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాను. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకలో నేను కూడా భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉంది. కోట్లాది మంది ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలకు ఈ కుంభమేళా ప్రతీకగా నిలిచింది. హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పింది.