Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి

– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి. విల్సన్

మాచర్లలో పోలింగ్ బూత్ లో చొరబడి విధ్వంసం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి ని తక్షణం అరెస్ట్ చేయాలి అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ డిమాండ్ చేశారు. పోలింగ్ భూత్ లో అడ్డుకున్న నంబూరి అనే వ్యక్తి పై పోలింగ్ తర్వాత చేసిన దాడి పాశవికం. ఈ దుర్మార్గం గురించి తెలిసినా పోలీస్ యంత్రాంగం అరెస్టు చేయకపోవడం దారుణం అన్నారు. ఎన్నికల కమీషన్ ఈవియం మిషన్ ని ధ్వసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.

సి ఎస్ ని సస్పెండ్ చేసి విచారణ జరపాలి
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డి మెహర్బానీ కోసమే పని చేశారు తప్పా … ఎన్నికలు వ్యవస్థను కాపాడలేదని.. తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చలేదని విల్సన్ దుయ్య పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థకు కళంకం తీసుకొచ్చిన జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణ జరపాలన్నారు.

సిట్ నివేదిక ఒక డొల్ల
అల్లర్ల పై వేసిన సిట్టివేదిక ఒక డొల్లని..నేరుగా పాత్ర వున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని గాని, మాచర్లలో విధ్వంసానికి కారణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడ్ని గానీ అరెస్ట్ ఆదేశాలు ఇవ్వకుండా ఒక డొల్ల నివేదిక ఇచ్చారని పోలింగ్ తదనంతరం జరిగిన దుర్మార్గాలపైన సిట్టింగ్ జడ్జి పై విచారణ జరపాలన్నారు. డిజిపి తక్షణం స్పందించకపోతే ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ని విల్సన్ కోరారు.

పోలిక బూత్ లో అడ్డుకున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం చేయడం.. ఇప్పటివరకు ఈ విషయాన్ని కపెట్టడం మానవత్వానికే మచ్చని అన్నారు. మారణాయుధాలతో దాడి చేసిన అసలు నిందితుల్ని కాపాడాలని ఎన్నికల కమిషన్ కూడా చూస్తుందని విల్సన్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు

LEAVE A RESPONSE