Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు

టిడిపి రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి. గంగాధర్

2024 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా వస్తారు, చంద్రబాబు నాయుడు చస్తారు అంటూ హిందూపురం లోక్‌సభ సభ్యులు గోరంట్ల మాధవ్ తన ప్రసంగంలో మాట్లాడటం ఒక వీడియో లో చూసి భయ భ్రాంతులకు గురి అయ్యాను. ఆయన వ్యాఖ్యలు లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాక భయభ్రాంతులకు గురి చేసి, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనుకుంటున్న గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడుపై హత్యకు కుట్ర చేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది. అందుకే మాధవ్ పై IPC-307 మొదలైన సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సముచిత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.

కేవలం ఆయనే కాదు అలానే చంద్రబాబుపై మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విచక్షణారహితంగా సంస్కార హీనంగా దుర్బాషలాడుతున్నారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE