– మాజీ ఎమ్మెల్యే / మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు మల్లాది విష్ణు
విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గం లోని గాంధీనగర్ లో YSRCP వెన్నుపోటు దినం కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే / మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు మల్లాది విష్ణు నాయకత్వ్యం లో జరిగింది. ఈ కార్యక్రమము లో భాగంగా ధర్నా చౌక్ వద్ద కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాల మీద నిరసన తెలిపారు. తదుపరి భారీ ర్యాలీ గా గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వెళ్ళడం జరిగింది.
ఈ ర్యాలీ లో కూటమి ప్రభుత్వం కారణం గా మోసపోయిన వాలంటీర్లు, ఆటో కార్మికులు, MDUలు , వివిధ హోదా ప్రజలు, నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కుట్ర పూరిత విధానాల మీద డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భం గా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని, చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని, సూపర్ సిక్స్ హామీలు రాష్ట్రం లో విఫలమయ్యాయి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని… చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు తన సహజ బుద్దిని చూపిస్తున్నారని మండిపడ్డారు.
వైయస్ జగన్ ఇచ్చిన నవరత్నాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందిఅని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందిని, తెనాలి లో ఎస్టి ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీస్ లు రోడ్లమీద కొట్టడం దారుణం అని అన్నారు. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అని అన్నారు.
రాష్ట్రంలో అన్ని రంగాలు తిరోగమనం కనపడుతోందని, నాడు – నేడు ద్వారా స్కూళ్లు ని అభివృధి చేసామని, ఆ స్కూల్లని ఆస్పత్రులు అన్నీనాశనం చెస్తున్నారని మరో వైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్ టిడిపి, బిజెపి, జనసేన కలిసి ప్రజల మీద వేసారని అన్నారు. గడచిన సంవత్సరం లో ఒక్క అభివృద్ధి పనులు చేయకుండా, ఏఒక్క పధకం ద్వార ప్రజలకు లబ్ది చేకుర్చకుండా కూటమి ప్రభుత్వం రూ.1,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అన్నారు.
విజయవాడ నగరాన్ని చెత్త నగరం గా మార్చింది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయం లో విజయవాడ నగరాన్ని సుందరమైన స్వచత కలిగిన నగరం గా మార్చడం జరిగినది. ఈ కూటమి ప్రభుత్వం లో ఏ వీధి, ఏ కూడలి లో చూసినా చెత్త – వ్యర్ధాలు పేరుకొని పోతున్నాయని, బుడమేరు వస్తుందని ప్రభుత్వానికి తెలిసిన.. ప్రజలకు ఎటువంటి సమాచారం అందించలేదు విజయవాడ నగరంలో 12 డివిజన్లో దాదాపుగా 2 లక్షల మంది ప్రజలని ఈ కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేయలేక పోయినది. తద్ద్వారా దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు ఆస్తి నష్టం భారీగా కలిగిందని, విపత్తు సహాయం కుడా సరిగా అందక ప్రజలు రోడ్డు మీదకి వచ్చారని గుర్తు చేసారు.
జగన్ మోహన్ రెడ్డి పాలన మొదటి సంవత్సరం లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో కేవలం అమ్మఒడి ద్వార 29,278 తల్లులకు 15,000 చొప్పున 43,91,70,000 రూపాయలు జమ చేసామని, జగనన్న విద్య దీవెన పధకం ద్వార నియోజకవర్గం లోని 3,340 మంది విద్యార్థులకు 7 కోటి 22 లక్షల 03 వేల 316 రూపాయలు లబ్ది జరిగిందని, కాపు నేస్తం పధకం ద్వార జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో 2019-2020 సంవత్సరాలకి గాను 792 మందికి గాను 15000 రూపాయల చొప్పున 1 కోటి 18 లక్షల 80 వేల రూపాయలు లబ్ది దారుల అకౌంట్ లో జమ చేసామని, O వడ్డీ పధకం లో భాగంగా 3266 పొదుపు సంఘాలకు – 32,660 మందికి సుమారు 5 కోట్ల 63 లక్షల 94 వేల 700 వందల రూపాయలు లబ్ది చేకూరిందని, వాహన మిత్ర ద్వార టాక్సీ – ఆటో డ్రైవర్ లకు ఆర్ధిక సహాయం క్రింద ఒక్క మధ్య నియోజక వర్గంలో 2,394 మందికి 10,000 చొప్పున 2 కోట్ల 39 లక్షల 40 వేల రూపాయల వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది అని ఆ లబ్ది దారులు చంద్ర బాబు నాయుడు – కూటమి ప్రభుత్వం లో అన్ని రకాలు గా నష్టపోతున్నారని తెలిపారు.
డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరకాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని సూపర్ సిక్స్ లో అనే పేరు తో 3 పార్టీ లు కలిసి ప్రజలని మోసం చేసాయని ప్రజల ఈ దు:స్తితి కి 3 పార్టీలకి సమాన భాగం ఉందని అన్నారు. చంద్రబాబే చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని రాష్ట్ర పరిస్తితి తెలియకుండా 30 సంవత్సరాల అనుభవం ఎం చేసుకోడానికని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమములో నియోజకవర్గ కార్పోరటర్లు కుక్కల అనిత, కొండైగుంట మల్లేశ్వరి, జాన రెడ్డి, సర్వాణి మూర్తి, సుందర్ పాల్, బాలి గోవింద్, ఇసరపు దేవి, MD షాహిన సుల్తన, అలంపూరు విజయ లక్ష్మి, యర్రగోర్ల తిరుపతమ్మ, రాష్ట్ర మైనారిటీ కార్యదర్సులు మస్తాన్, అక్బర్, పటాన్ నజీర్ ఖాన్, SD బాబు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి త్రీవేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, రాష్ట్ర BC విభాగం కార్యదర్శి నాగేంద్ర, నియోజక వర్గం మహిళా విభాగం అధ్యక్ష్యురాలు తోపుల వరలక్ష్మి, యువజన విభాగం అధ్యక్ష్యులు మాతమహేష్, BC విభాగం అధ్యక్ష్యులు గణపతి రావు,SC విభాగం అధ్యక్ష్యులు గుడిసె శ్యాం, ST విభాగం అధ్యక్ష్యులు కుంబ రవి వర్మ, మైనారిటీ విభాగం అధ్యక్ష్యులు అబ్దుల్ నజీర్, క్రిస్టియన్ విభాగం అధ్యక్ష్యులు కిరణ్ కుమార్,విద్యార్ధి విభాగం అధ్యక్ష్యులు మరకపుడి సురేష్,పంచాయతి రాజ్ విభాగం అధ్యక్ష్యులు ఆంజనేయులు, మునిసిపల్ విభాగం అధ్యక్ష్యులు కుక్కల రమేష్,RTI విభాగం అధ్యక్ష్యులు చల్ల సుధాకర్, వాలంటీర్ విభాగం అధ్యక్ష్యులు రాగోలు సిమ్మి నాయుడు,గ్రేవింస్ విభాగం అధ్యక్ష్యులు నందేపు సురేష్,వాణిజ్య విభాగం అధ్యక్ష్యులు ప్రవీణ్ కుమార్,చేనేత విభాగం అధ్యక్ష్యులు యక్కల శంకర్ రావు,కార్మిక విభాగం అధ్యక్ష్యులు పసుపులేటి కోటేశ్వర రావు,అంగన్వాడి విభాగం అధ్యక్ష్యురాలు భవాని రెడ్డి,లీగల్ విభాగం అధ్యక్ష్యులు ఉదయ కిరణ్,సాంస్కృతిక విభాగం అధ్యక్ష్యులు ప్రేమ కుమార్, సోషల్ విభాగం అధ్యక్ష్యులు మీసాల సత్యనారాయణ,ఇన్తలెక్తుఅల్ విభాగం అధ్యక్ష్యులు మొహమ్మద్ రఫీ,బూత్ కమిటి విభాగం అధ్యక్ష్యులు కంభం కొండల రావు తదితరులు పాల్గొన్నారు.