Suryaa.co.in

Political News

హస్తినలో రాజకీయం మారింది

కొన్ని నెలల క్రితం సుబ్రమణ్య స్వామిని తాడేపల్లికి ఆహ్వానించాడు జగన్. ఆయనేమో చైనా నుండి దేశ ఆర్థిక పరిస్థితుల వరకు మోడీ పాలన మీద ప్రత్యక్షంగానే ట్విట్టర్ ద్వారా ఏకేస్తున్నారు.మరోవైపు అభివృద్ధి రేట్ ను అదేపనిగా తగ్గిస్తూ వచ్చాయి అంతర్జాతీయ సంస్థలు. ఇంకో వైపు రూపాయి పతనం. ఈ దశలో నవంబర్ ఆఖరివారంలో జి20 కిరీటం మన దేశానికి ఇచ్చే వేళ జరిగిన సమావేశంలో, మోడీ బైడెన్ కలయిక & ఫోటోల మీద తీవ్ర చర్చలు నడిచింది. మోడీ గారి ముందు జగన్ లా బైడెన్ ముందు మోడీ అన్నట్లు చర్చలు జరిగాయి.

సుబ్రమణ్య స్వామి మోడీ బైడెన్ వున్న చిత్రం పెట్టి ఇది మార్ఫింగ్ చిత్రమా కాదా.. అమెరికాలో ఫేక్ మోడీ ప్రచారాలు అని జోక్ లు వేసుకొంటున్నారు, వినడానికి బాధాకరంగా వుంది అంటూ తీవ్రంగా విమర్శించారు. నిన్న జి20 సన్నాహక సమావేశంలో నాయుడు డిజిటల్ ఎకానమీ గురించి చెప్పడం, అది బిజెపి మీడియా రిపబ్లిక్ లో ట్రెండ్ అవ్వడం, మోడీ నీతి ఆయోగ్ పరమేశ్వర్ అయ్యర్ ని కలిసి వెళ్లండి అని నాయుడిని కోరడం చకచకా జరిగిపోయాయి.

శాలువాతో నీతి ఆయోగ్ పరమేశ్వర్ అయ్యర్ ని సత్కరించడం, బొకే ఇవ్వడం, ఒక నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి. సలహా ఇవ్వడానికి వెళ్లి సత్కారం ఏంది? అంతలోనే డాక్యుమెంట్ ఎలా సిద్ధం చేశాడు నాయుడు అనే అనుమానం అందరికీ వస్తుంది. ఇదో సందర్భం అంతే. మిగిలింది అంతా ముందే అనుకొని వున్నదే ఏమో అనే అనుమానాలు రావడం సహజం. ఇవాళ పొద్దున ప్రపంచ బ్యాంకు భారత అభివృద్ధి రేటింగ్ పెంచడం & రూపాయి కూడా మిగిలిన దేశాలతో పోల్చితే మెరుగవ్వడం అనే వార్తలు వచ్చాయి. నాయుడు ఢిల్లీ వెళ్లిన వేళా విశేషం శుభాలు అని మీరు అనుకోవడం వరకు ఆగిపోండి. మరింత లోతుగా ప్రస్తుత సీఎం లకు కూడా దక్కని మంత్రుల మర్యాదలు గట్రా లోతుగా విశ్లేషించి చెబితే వైకాపాన్లు వచ్చి కథలు గట్రా అని విరుచుకుపడి నిద్రపోరు.

– రమాదేవి

LEAVE A RESPONSE