Suryaa.co.in

Andhra Pradesh

సంక్రాంతి కానుకగా గుంతలు లేని రోడ్లు

– చంద్రబాబు పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ
– అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం
– గత ప్రభుత్వం గుంతల రోడ్లు ఆస్థిగా ఇచ్చి వెళ్ళింది
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బుచ్చి- ఊటుకూరు రోడ్డు విస్తరణకు 29 కోట్లు
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరు: గత ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్ల నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొడవలూరు రైల్వే గేట్ సమీపంలో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త రోడ్లు వేయకపోగా కనీసం గుంతలు పడ్డ రోడ్ల పై తట్టెడు మట్టి వేసి పూడ్చిన పాపాన పోలేదన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రోడ్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. అధ్వాన పరిస్థితిలో వున్న రోడ్ల కారణంగా నిత్యం ప్రమాదాలతో ప్రజలు అవస్థలు పడుతున్న కారణంగా కొత్త రోడ్లు వేసే వరకు గుంతలు పడ్డ రోడ్లకు తాత్కాలిక మరమత్తులు చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

గుంతలు పడ్డ రోడ్లను బాగు చేసే కార్యక్రమం తలపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాలలో దాదాపు 62 కిలోమీటర్ల మేర గుంతల రోడ్లు వున్నాయని ఆర్ అండ్ బి ఇంజనీర్లు గుర్తించడం జరిగిందన్నారు.

రోడ్ల ప్యాచ్ వర్కుల కోసం రాష్ట ప్రభుత్వం కోవూరు నియోజకవర్గానికి ఒక కోటి ఐదు లక్షల రూపాయలు నిధులు విడుదల చేసిందన్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం జనవరి 15 అంటే సంక్రాంతి లోపు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు యివ్వడం జరిగిందన్నారు.

ఇటీవల “పల్లె పండుగ” పేరిట ప్రతి మండలానికి కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ ప్రాంతాలలో కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణాలతో గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. రాష్ట ప్రభత్వ నిధులే కాకుండా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కోవూరు నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 49 కోట్ల రూపాయలు నిధులు సాధించుకున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులతో పాటు కొడవలూరు తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి, వెంకట సుబ్బారావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రట్రీ జీవీఎం శేఖర్ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు నాయకులు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, తువ్వర ప్రవీణ్ కుమార్, నాపవెంకటేశ్వర్లు నాయుడు, పాటు రమేష్ బాబు, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జీలానీ బాషా, పంది శ్రీనివాసులు, పుట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE