– పద్మశాలీలకు వైసీపీ మొండిచేయి
– పద్మశాలీ సంఘం నేతల నిరసన
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఆ సంఘం అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో పద్మశాలీలకి ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఇవ్వకపోవటం పట్ల…. పద్మశాలి అభ్యర్థిగా పోతుల సునీతకి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చెయ్యడం జరిగింది.
ఆమె పద్మశాలి కాదు. తవిట క్షత్రియ. చేనేత సంబంధించిన మహిళగా చెప్పటం జరిగింది. 18 చేనేత ఉప కులాల్లో ఒక కులం అయిన తవిటి క్షత్రియ కులానికి చెందిన మహిళగా చెప్పటం జరిగింది. 11 శాతం ఉన్న పద్మశాలీలకు 4 నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వవలసిందిగా ఒక్కటి కూడా ఇవ్వలేదు, చాలా బాధాకరమైన విషయం. ఒకటి రెండు ఓటు శాతం ఉన్న వారికి మాత్రం రెండు మూడు స్థానాలు కలిపియటం పట్ల చేనేతలు మరియు పద్మశాలీల పట్ల ఈ వైయస్సార్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, ఇప్పటికైనా సరే పద్మశాలిని గుర్తించాలని.. పద్మశాలీలు ఉన్నచోట పద్మశాలీలకు mla సీట్లు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో 26 సట్ల పద్మశాలీలు 50 నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయని కానీ నాయకులు మాత్రం పద్మశాలిని అనగతొక్కుతూ ఉన్నారు.
ఇప్పటికైనా పద్మశాలిని గుర్తించి మా స్థానాలు మాకు ఇవ్వాలని లేనిపక్షంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో కమిటీలు ఏసి మీటింగ్ నిర్వహించడం జరిగింది. త్వరలో పద్మశాలీలు మరియు చేనేత కులాల 18 తెగలు అందరూ కలిసి చేనేత గర్జన పేరుతో భారీ బహిరంగ సభ పెడతానికి కార్యాచరణని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు పద్మశాలికి కేటాయించాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ కి ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి సంఘం తాడేపల్లిగూడెం ఉపాధ్యక్షులు బండారు బెనర్జీ సంఘ ప్రధాన కార్యదర్శి చిలుకూటి అంజిబాబు, మరో ఉపాధ్యక్షులు పాల శ్రీనివాసరావు, చిన్న కాకాని అధ్యక్షులు పంచమర్తి శ్రావణ్ కుమార్, కాజా కార్యదర్శి ఉడత శ్రీరామ్ మూర్తి, మంగళగిరి నియోజకవర్గ పద్మశాలియ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.