Suryaa.co.in

Andhra Pradesh

రెండవ రోజూ కొనసాగిన ప్రజాదర్బార్

వినతులు, పిర్యాదులపై అధికారులతో మాట్లాడిన విజయసాయి రెడ్డి

విశాఖపట్నం : మంగళవారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 7.30 గంటలవరకు కొనసాగిన ప్రజాదర్బార్ లో 140 కి పైగా వినుతులు. పిర్యాదులు స్వీకరించిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, రెండవరోజు బుధవారం ఉదయం 10 గంటలకే ప్రజాదర్బార్ కు హాజరై ప్రజలనుండి వినతులు, పిర్యాదులు స్వీకరించడం ప్రాంరభించారు. మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ ముగిసే సమయానికి తమ పిర్యాదులు, వినతులు సమర్పించలేకపోయిన వారికి బుధవారం మెదటి ప్రాధాన్యత ఇచ్చారు. వారి వద్ద నుండి ముందుగా పిర్యాదులు, వినుతుల స్వీకరించారు. రెండు రోజుల్లో 175 కు పైగా వినతులు స్వీకరించారు. విఎంఆర్ డి ఏ లో గత 10 సంవత్సరాలుగా 21 మంది కమ్యూనిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్నామని, చాలీచాలని జీతాలతో జీవనం గడపుతున్నామని, తమకు జీతాలు పెంచేలా చర్యలు చేపట్టాలని వి ఎం ఆర్ డిఏ కమ్యూనిటీ గార్డులు ఈశ్వరరావు, బాబూరావులు వినతి పత్రం అందించారు.గాజువాక భానోజీతోటలో నివాసం ఉంటున్న ముస్లింలకు షాదిఖానా నిర్మించాలని 66 వా వార్డు వైకాపా ప్రెసిడెంట్ షెక్ సౌకత్ అలీ విపతి పత్రం అందించారు.

ఏపి బాలయోగి గురుకులం పార్ట్ టైం అధ్యాపకులుగా విదులు నిర్వహిస్తున్నామని, తమకు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ బద్రత కల్పంచాలని విశాఖపట్నం జిల్లా బాలయోగి గురుకులం అద్యాపకులు సంఘం ప్రతినిధులు సూర్యప్రకాష్ రావు,వెంకట రమణ,సరోజలు వినతి పత్రం అందింఒచారు. విశాఖపట్నం జిల్లాలో 92 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 1720 మంది బాలయోగి గురుకులాలలో అద్యాపకులగా పనిచేస్తున్నారని అన్నారు. గాజువాకకు చెందిన బి వేణుగోపాల్ తనకు టిడ్కో ఇల్లు కేటాయించాలని వినతి పత్రం అందించాడు. జైల్ రోడ్డులోని పుడ్ కోర్టు ఎత్తివేయడంతో తాము
VSR1 జీవనాదారం లేక ఇబ్బందులు పడుతున్నామని, పుడ్ షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని నరసింగ్, లక్ష్మిలు కోరారు. నాయుడుతోటకు చెందిన సాయిభాస్కర్ సింహాచల దేవస్థానం భూములు పరిధిలో ఇల్లుకు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో తమకు ఇంటినిర్మాణానికి లోన్స్ మంజూరు కావడం లేదని తమ సమస్యకు పరిష్కర మార్గం చూపాలని వినతి పత్రం అందించాడు.పూర్ణ మార్కెట్ లో నివాసం ఉంటున్న ఈ రాంబాబు తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని, చికిత్స కోసం ప్రభుత్వ సహాయం కావాలని వినతి పత్రం అందించాడు. మరికొందరు ఇంటి స్థలం కావాలని, కొళాయి కనెక్సన్ కావాలని, ఇతత వ్యక్తిగత సమస్యలపై వినతి పత్రాలు, పిర్యాదులు అందించారు. ఉదయం పది గంటల నుండి మద్యాహ్నం 2 గంటలవరకు సాగిన ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన ఎంపీ విజయసాయి రెడ్డి, సంబందిత అధికారులతో మాట్లాడి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.

LEAVE A RESPONSE