విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామంలో ప్రవళిక అంత్యక్రియలు ఈరోజు ఉదయం పూర్తి అయ్యాయి..కన్నవారితో పాటు ఊరంతా కన్నీళ్ల పర్యంతం అయ్యారు..భారీ పోలిస్ భద్రత మధ్య ప్రవళిక అంతిమ సంస్కరాలు ముగిశాయి..విషాదం..అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇప్పుడు కానరాని లోకాలు వెళ్లిపోయింది.
వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది..తాజాగా, గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు..
సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవళిక మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.ఇంటికి దూరంగా వచ్చి హాస్టల్ ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వుతున్న అమ్మాయి..ఉన్నట్లుండి ఇలా కానరాని లోకాలు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణాతీతంగా మారింది..ప్రవళిక మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
అయితే ప్రవళిక చనిపోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది,అందులో నా ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు? అమ్మానాన్న నన్ను క్షమించండి, మరో జన్మంటూ ఉంటే మీ కడుపులో మళ్ళీ పుడతాను. నేను ఓడిపోయాను, నేను మీకు ఏం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి అమ్మానాన్న..అని సూసైడ్ లెటర్ రాసుకుంది..
విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు.నిన్న రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళిక ఆహత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.