Suryaa.co.in

Andhra Pradesh

సీఎం వైయ‌స్‌ జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు

దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌వాసాంధ్ర ద‌ళిత క్రిస్టియ‌న్లు కృతజ్ఞతలు తెలియజేశారు. యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.

బుర్‌ దుబాయ్‌లోని వెస్ట్‌ జోన్‌ సూపర్‌ మార్కెట్‌ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ కృతజ్ఞత సభకు యూఏఈ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా, నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE