సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంటే నా ప్ర‌యాణం..

Spread the love

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

నెల్లూరు: చివ‌రి ర‌క్త‌పుబొట్టు వ‌ర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంటే త‌న ప్ర‌యాణ‌మ‌ని, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంద‌రు వ్య‌క్తులు, కొన్ని మీడియా సంస్థ‌లు త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. పార్టీ మారుతున్న‌ట్టుగా వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అని ధ్వజమెత్తారు. అందులో భాగమే ఈ దుష్ప్రచారమని, కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని త‌న విషప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఫైర‌య్యారు. కోవూరులో పార్టీ వేరే అభ్యర్థికి టికెట్‌ ఇచ్చినా.. అత‌ని గెలుపుకోసం ప‌నిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply