ప్రవీణ్ ప్రకాశ్ లాంటి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ఉపాధ్యాయులపై కక్షసాధింపు
-ప్రభుత్వం చేసిన తప్పులకు ఉపాధ్యాయులు ఎలా బాధ్యులవుతారో ప్రవీణ్ ప్రకాశ్, మంత్రి బొత్స సమాధానం చెప్పాలి
• వివాదాస్పదుడైన ప్రవీణ్ ప్రకాశ్ ను విద్యాశాఖకార్యదర్శిగా నియమించాకే ఆ శాఖకు కొత్త తలనొప్పులు వచ్చాయి
• ప్రవీణ్ ప్రకాశ్ ను సమర్థిస్తూ మాట్లాడుతున్న మంత్రి బొత్స, తనశాఖ వైఫల్యాలను ఎందుకు అంగీకరించరు?
• ప్రవీణ్ ప్రకాశ్ తో ఉపాధ్యాయల్నిసాధిస్తున్న ముఖ్యమంత్రి బైజూస్ విధానంపై ఏం సమాధానం చెబుతారు?
• బైజూస్ విద్యావిధానంపై తక్షణమే హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
రాష్ట్ర విద్యాశాఖపరిస్థితి దారుణంగా తయారైందని, ప్రవీణ్ ప్రకాశ్ వంటి అధికారులతో విద్యా రంగ ప్రమాణాలు దిగజారుతున్నాయని, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతనవిద్యా విధానం (ఎన్.ఈ.పీ) బీజేపీ పాలితరాష్ట్రాలే అమలుచేయడంలేదని, కానీ ఏపీప్రభుత్వం పనిగట్టుకొని దాన్ని హడావుడిగా ప్రారంభించడం, 8వతరగతినుంచే ఇంగ్లీష్ మీడియం, సీ.బీ.ఎస్.ఈ సిలబస్ ప్రవేశపెట్టడం ఎంతమాత్రం సరైనవిధానం కాదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే…
“ప్రవీణ్ ప్రకాశ్ ఎలాంటి అధికారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పు డే ఆయన వివాదాస్పదుడిగా పేరుపొందారు. అలాంటివ్యక్తిని విద్యాశాఖలో నియమించడం ఆ శాఖకు కొత్తతలనొప్పులు తీసుకొచ్చింది. ప్రవీణ్ ప్రకాశ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయ డం, విద్యార్థులకు అందుతున్న విద్యను పరిశీలించడం మంచిదే. కానీ ఎం.ఈ.వోలు, డీ.ఈ.వోలు, టీచర్లను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం. ఆఖరికి బదిలీపై వెళ్లినవారిని కూడా అకారణంగా సస్పెండ్ చేశారు. 8వతరగతి నుంచి సీ.బీ.ఎస్.ఈ సిలబస్ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణ సెమిస్టర్ల వారీగా జరుగుతోంది. 8వతరగతిలో 3సెమిస్టర్లు ఉంటే, మూడుసార్లు పుస్తకాలు పంపిణీచేయాలి. అలాంటి వ్యవస్థ మనకుందా అనే ఆలోచన ప్రభుత్వంగానీ, ప్రవీణ్ ప్రకాశ్ లాంటి అధికారులు గానీ ఎందుకు చే యరు? సెమిస్టర్లవారీగా పుస్తకాలు అందిస్తే విద్యార్థులు ఎప్పుడుచదవాలి.. ఉపాధ్యాయులు వారికి ఎప్పుడో పాఠాలు బోధించాలి? బాధ్యత లేకపోతే ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయమా అంటూ ప్రవీణ్ ప్రకాశ్ ను సమర్థించేలా మాట్లాడుతున్న మంత్రి బొత్స సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేకపోవడంపై ఎవరిని సస్పెండ్ చేస్తారో సమాధానం చెప్పాలి.
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 10వతరగతి చదివే విద్యార్థులు, 6, 7 తరగతుల పాఠ్యాంశాల్లోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆ విషయం ప్రవీణ్ ప్రకాశ్ తెలుసుకోవాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనితీరు బాగుందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోవడంలేదని, అక్కడి ఉపాధ్యాయులు కేవలం రూ.15, రూ.20వేల జీతాలకు పనిచేస్తుంటే, మీరుమాత్రం రూ.70వేలనుంచి రూ.లక్షవరకు తీసుకుంటున్నారని ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయుల్ని అనడం ఎంతమాత్రం సరైందికాదు.
ఉపాధ్యాయులు ఎందుకు సిగ్గుపడాలో కూడా ప్రవీణ్ ప్రకాశ్ చెప్పాలి. విద్యార్థులకుసరైన సమయంలో పాఠ్యపుస్తకాలు అందించనందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆ ప్రభుత్వంలో భాగ స్వామిగాఉన్నందుకు ప్రవీణ్ ప్రకాశ్ సిగ్గుపడాలి. పాఠ్యపుస్తకాలు కూడామారాయి. సీ.బీ.ఎస్.ఈ సిలబస్ రావడంతో తెలుగుమీడియం, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు విడివిడిగా వస్తున్నాయి. ఇదేమీ గమనించకుండా ఎం.ఈ.వోలు, డీ.ఈ.వోలను ఉపాధ్యాయుల్ని సస్పెం డ్ చేసి చేతులు దులుపుకోవడం అన్యాయంకాదా? ప్రవీణ్ ప్రకాశ్ ను సమర్థిస్తూ విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ, బాధ్యత లేకపోతే సస్పెండ్ చేయమా అంటున్నారు. సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనందుకు మంత్రి సిగ్గుతో రాజీనామాచేయాలి.
జూన్ లో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, ఫిబ్రవరిలో ఇస్తే, ఉపాధ్యాయులు ఎప్పుడు పాఠాలు చెప్పాలి?
గతంలో జూన్ లో పాఠశాలలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఠంచన్ గా పాఠ్య పుస్త కాలు అందేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి వచ్చినా పుస్తకాలు అందించలేక పోయింది. అదేమంటే విద్యాదీవెన కిట్లు ఇచ్చామంటున్నారు. కిట్లతో ఉపయోగం ఏమిటి? విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండా పాఠాలు చెప్పలేదని ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం దారుణం కాదా? విద్యాశాఖలో గతంలో చాలామంది ప్రధానకార్యదర్శులగా పనిచేశారు. వారితో ఎప్పు డూ ఉపాధ్యాయులకు అభిప్రాయబేధాలు లేవు. కానీ ప్రవీణ్ ప్రకాశ్ లాంటి అధికారి వచ్చాకే ఎందుకిలా జరుగుతోందో మంత్రి బొత్స ఆలోచించాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువచెబుతూ, వారిపై పనిభారం పెంచింది నిజంకాదా? ఎలక్షన్ విధులులేకపోయినా, జనాభాలెక్కల్లాంటి బాధ్యతను ఉపాధ్యాయులే చూడాలని ప్రభుత్వనిబంధనల్లోనే ఉంది. విద్యాదీవెన కిట్లు అందించడం ఆ వివరాలు యాప్ లలో నమోదుచేయాలని చెప్పడం ఉపా ధ్యాయులకు భారం కాదా? సరిగా మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు యాప్ లలో వివరాలు ఎలానమోదుచేస్తారనే ఆలోచనలేకుండా వారిని దండిస్తారా?
ప్రవీణ్ ప్రకాశ్ ను తక్షణమే విద్యాశాఖ నుంచి తప్పించాలి
నూతనవిద్యావిధానం పేరుతో తరగతుల విలీనంచేపట్టి, 8వతరగతి నుంచి పై తరగతులు ఒక కేటగిరీ, 1 నుంచి 3వతరగతి వరకు ఉన్న అంగన్ వాడీలను ప్రీస్కూళ్లుగా, 3 నుంచి 7 వతరగతి వరకు మరోకేటగిరీగా మార్చి, ఇష్టమొచ్చినట్టు చేశారు. పాఠ్యపుస్తకాలను కూడా మార్చి తెలుగుమీడియంవారికి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియంవారికి తెలుగుపుస్త కాలు అందించారు. దానిపర్యవసానమే 6లక్షల డ్రాపవుట్స్. వీటికి సమాధానం ఎవరు చెబు తారు? డ్రాపవుట్స్ పెరిగినందుకు ఎవరిని సస్పెండ్ చేయాలి. ప్రవీణ్ ప్రకాశ్ నా..లేక విద్యా శాఖమంత్రినా..లేక ముఖ్యమంత్రినా? ప్రవీణ్ ప్రకాశ్ ఎక్కడికివెళ్తే అక్కడ ఉపాధ్యాయు ల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు?
శ్రీకాకుళంలో 5గురు, పార్వతిపురంలో 5గుర్ని ఇలా ఎక్కడి కి వెళ్తే అక్కడ ఇష్టానుసారం సస్పెండ్ చేస్తారా? ఉపాధ్యాయులందరినీ సస్పెండ్ చేసుకుం టూ పోతే, విద్యార్థులకు పాఠాలు ఎవరుచెబుతారు? బైజూస్ వ్యవస్థను తీసుకొచ్చి ఏంసాధిం చారు. ఆ విధానం ఫెయిల్ అయిందుకు ప్రవీణ్ ప్రకాశ్ ను సస్పెండ్ చేయాలా..లేక మంత్రినా ? ప్రవీణ్ ప్రకాశ్ ఇష్టానుసారంచేస్తే ఉపాధ్యాయసంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరిస్తు న్నాం. గతంలో తానుపనిచేసిన వివిధశాఖల్లోకూడా ప్రవీణ్ ప్రకాశ్ పరిధులుదాటి వ్యవహరించారు.
ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకునేముందు ప్రవీణ్ ప్రకాశ్ బైజూస్ విధానంపై సమాధా నంచెప్పాలి? ఆ విధానం ఎందుకు ఫెయిలైందో, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో కూడా ప్రకాశ్ చెప్పాలి. తన స్వార్థం కోసం విద్యాశాఖను ప్రయోగాలకేంద్రంగా మార్చింది ప్రభుత్వం కా దా? ఉపాధ్యాయులపై ఇదేవిధమైన కక్షపూరితధోరణితో వ్యవహరిస్తే ప్రతిపక్షం ఉద్యోగసంఘా ల పక్షానే నిలుస్తుంది. గతంలో ఉపాధ్యాయులు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవం తం చేశారనో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమప్రభుత్వానికి మద్ధతివ్వలేదనో అక్కసుతో ఉపాధ్యా యుల్ని లక్ష్యంగా చేసుకుంటే, దానిపర్యవసానాలు చాలాదారుణంగా ఉంటాయి.
పార్వతిపు రంలో ఉద్యోగసంఘాలు చేసిన ఉద్యమం ప్రభుత్వం దృష్టిలోపడింది. కానీ అక్కడ ప్రవీణ్ ప్రకాశ్ చేసింది తప్పని తేలింది. ప్రవీణ్ ప్రకాశ్ ను తక్షణమే విద్యాశాఖ కార్యదర్శి పోస్ట్ నుంచి తప్పించాలి. ప్రజాసంబంధాలతో సంబంధంలేని విభాగానికి అతన్ని పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖను ప్రక్షాళనచేసి, నూతనవిద్యావిధానాన్ని రద్దుచేసి, పాత విధానాన్నే కొనసాగించాలని ఉపాధ్యాయుల తరుపున తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తోంది. తనకు ఏమీలేదు, ఎవరూలేరు ప్రజలే అండగా ఉండాలని అమాయకంగా మాట్లాడుతున్న ముఖ్య మంత్రి తక్షణమే బైజూస్ విద్యావిధానంపై సిట్టింగ్ హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయులపైకక్షసాధింపు ధోరణిని పాలకులు విడనాడాలి.” అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.