Suryaa.co.in

Andhra Pradesh

పీఆర్సీ బిల్లులు చేయాలంటే ఎస్‌ఆర్‌లు కావాలి

– ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శోభన్‌బాబు లేఖ

అమరావతి : ఏపీ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌కు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శోభన్‌బాబు లేఖ రాశారు. పీఆర్సీ బిల్లులు చేయాలంటే ఎస్‌ఆర్‌లు కావాలని ఆ లేఖలో వెల్లడించారు. ఎస్‌ఆర్‌ల వెరిఫికేషన్ తరువాతే ఫిక్సేషన్ ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు. లేకపోతే చేయలేమని స్పష్టం చేశారు. పీఆర్సీకి సంబంధించి జీవో 1, పేరా 10లో పొరపాటుగా తప్పు పేమెంట్ చేస్తే ట్రెజరీ ఆఫీసర్లను బాధ్యులు చేస్తామన్నారని, రెండు మూడు రోజుల్లో బిల్స్ వెరిఫికేషన్ కష్టమని, వెంటనే చేయాలనడం సమంజసం కాదన్నారు. ఈ ప్రాసెస్‌కు కాస్త అదనపు సమయం పడుతుందన్నారు. బిల్స్‌తో పాటు ఎస్‌ఆర్‌లు అందుబాటులోకి వస్తే తప్ప ఏమీ చేయలేమని వెల్లడించారు. ఇప్పటికే లక్షలాదిగా ఉద్యోగులు పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ లేఖలు రాస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధంలో పడ్డారు. తమకు కావాల్సిన సమయం ఇవ్వకపోతే పొరపాట్లు జరిగితే విలువైన ప్రజా ధనం నష్టపోయే ప్రమాదం ఉందంటూ శోభన్‌బాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE