Suryaa.co.in

Andhra Pradesh

నా భర్తను వేధిస్తున్న పోలీసులపై ప్రేవేట్‌ కేసులు వేస్తా

– న్యాయపరంగా ఎదుర్కొంటా
– జగన్‌ మా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు
– ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన
– వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవికిరణ్‌ భార్య ఇంటూరి సుజన

తాడేపల్లి: ఇంటూరి రవికిరణ్‌ను గత నెల 21 నుంచి పోలీసులు వేధిస్తూనే ఉన్నారు, గుడివాడలో రెండు కేసులు, అరండల్‌పేటలో ఒకటి, వైజాగ్‌లో రెండు ఇలా మొత్తం 9 కేసులు పెట్టారు, గుడివాడ, గుంటూరు పోలీసులు పీఎస్‌ల చుట్టూ తిప్పిన తర్వాత, దువ్వాడ పోలీసులు వచ్చి సంతకం పెట్టాలని తీసుకెళ్ళి పీఎస్‌లో దారుణంగా ప్రవర్తించారు.

పోలీసులకు పైనుంచి వస్తున్న ఫోన్లను ఫాలో అయి దానికి సంబంధించినట్లు చేస్తున్నారు. ఒక స్టేషన్‌లో స్టేషన్‌ బెయిల్‌ వచ్చి బయటికి రాగానే ఇంకో పీఎస్‌ పోలీసులు వచ్చి తీసుకెళుతున్నారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా చెప్పరు. ఏ కేసు అనేది చెప్పరు. కేసుల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు.

రాజమండ్రి సీఐ చాలా దారుణంగా ప్రవర్తించాడు, రవి చెప్పనివి కూడా చెప్పినట్లు రాసి సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్‌కు తరలించారు. మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మేం జగనన్నకు కలిసి ఇదంతా వివరించాను. జగనన్న భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామన్నారు.

పోలీసులపై నేను కూడా ప్రేవేట్‌ కేసులు వేస్తాను. రాజమండ్రి పోలీసులు రవికిరణ్‌ను దారుణంగా ప్రవర్తించారు. రాజమండ్రి ప్రకాష్‌నగర్‌ సీఐ తనను కొట్టారు. నా భర్త ఎలాంటి అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టులు పెట్టలేదు. ఈ కేసులన్నీ న్యాయపరంగా ఎదుర్కొంటాం.

LEAVE A RESPONSE