– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనుపాల కిషోర్ కుమార్ రెడ్డి
హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట ధర్నా చేయడం జరిగింది.ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనుపాల కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా మారిందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను నిర్వీర్యం చేస్తున్నారని అదేవిధంగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అంద లేక పోతుందని మండిపడ్డారు. వర్షాకాలం మొదలైన ఇప్పటి వరకు దుప్పట్లు లేక చలికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టళ్ల లో కనీస అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని.
వైన్ షాప్ టెండర్లు మూడు నెలల ముందే పెట్టిన ముఖ్యమంత్రి మరియు ఎన్నికల కోసం అభ్యర్థులను కూడా మూడు నెలల ముందే ఖరార్ చేసిన ముఖ్యమంత్రి మరి సంక్షేమ హాస్టల్ లో మొదలై మూడు నెలలు కావస్తున్న వారి సమస్యలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు..రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి చార్జీలు వెంటనే చెల్లించాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం పక్కా భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వాచ్మెన్, కామాటి, వార్డెన్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటే డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు డీజే శివ గౌడ్, పోల్కార్ సాయిరాం, మచ్చ సైదులు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్, అధికార ప్రతినిధి చీమ మహేష్, అమరేందర్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు అజయ్ నకిరేకంటే గణేష్ జయేందర్, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కులుకులపల్లి జయేందర్, రవీందర్ నాయక్, అజయ్, హరికృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వినయ్, అజయ్, రాము తదితరులు పాల్గొన్నారు