ఉత్తరాదిలోనూ హిందూ ధర్మ ప్రచారం

– ఏడాదిన్నరలో జమ్మూ ఆలయ నిర్మాణం పూర్తి
– టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
ఉత్తరాదిలోనూ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.ఢిల్లీలోని టీటీడీ ఆలయ సలహా మండలి చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకులు వీరికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.
అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు ఢిల్లీ సలహా మండలి కృషి చేస్తుందని చెప్పారు. ఢిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల టీటీడీ కి ఆలయాలున్నాయని తెలిపారు. జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని, 18 నెలల్లో ఆలయ నిర్మాణణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. టీటీడీకి అయోధ్యలో స్థలం కేటాయించాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని కోరామని చెప్పారు. ఆలయనిర్మాణ కమిటీ నుంచి వచ్చే స్పందన మేరకు అక్కడ ఆలయం లేదా భజనమందిరం నిర్మాణం పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇందుకోసం ఎపి రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు చేసుకున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు బాటుధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందన్నారు.
తిరుమలశ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానం తో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారితఉత్పత్తులను సేకరిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఢిల్లీ శ్రీవారి ఆలయంలో గోపూజ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చెన్నై స్థానికసలహా మండలి సభ్యులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.