Suryaa.co.in

Andhra Pradesh

సూరత్ లో సూయెజ్ వాటర్ ను డ్రింకింగ్ వాటర్ స్థాయికి శుద్ధి చేయడం అభినందనీయం

– తన సూరత్ పర్యటనలో స్వయంగా ఆ నీటిని తాగి అక్కడి కార్పొరేషన్ అధికారులను ప్రశంసించిన స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

సూరత్: గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలు పర్యటించి అక్కడి నగరాల పారిశుధ్య నిర్వహణకు అధికారులు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరియు ఆయన సభ్యుల బృందం వరుస పర్యటనలు చేస్తూ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుజరాత్ నగరం లోని సూరత్ మహానగరంలోపర్యటించారు.

అక్కడ పారిశుధ్య నిర్వహణకు అవలంభిస్తున్న విధి విధానాలను చూసిన స్వచ్చాంధ్ర సభ్యుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.. ఒకప్పుడు పారిశుధ్య లేమితో మురికి కూపంలా ఉండటమే కాకుండా “ప్లేగు” వ్యాధి కూడా విస్తరించిన సూరత్ మహానగరం ఇప్పుడు పరిశుభ్రతలో దేశంలోనే ఒక అగ్రగామి నగరంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం రామచంద్రరావు అనే తెలుగు ఐఏఎస్ అధికారి సూరత్ మునిసిపల్ కమీషనర్ గా ఉండటమేనని పట్టాభి తెలిపారు.

ఒక నగరం అపరిశుభ్రత నుంచి బయటపడి స్వచ్ఛమైన నగరంలా మారడానికి కృషి చేసిన రామచంద్రరావు తెలుగువారవడం చాలా సంతోషంగా ఉందని అది తెలుగు వారందరికీ గర్వ కారణం అని పట్టాభిరామ్ తెలిపారు. అలాగే తమ పర్యటనలో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు గమనించడం జరిగిందని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సూరత్ నగరంలోచాలా అద్భుతంగా చేస్తున్నారని పట్టాభి తెలిపారు.

దాదాపుగా 2,285 కిలోమీటర్ల సూయెజ్ పైప్ లైన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని 11 ఎస్టిపిల ద్వారా నగరంలో నుంచి వస్తున్నటువంటి దాదాపు 1076 MLD డ్రైనేజ్ వాటర్ మొత్తాన్ని ట్రీట్ చేస్తున్నారని దానిని మరలా రెండవ సారి టెరిషరీ ట్రీట్మెంట్ కూడా చేసి సూయేజ్ వాటర్ నీ డ్రింకింగ్ వాటర్ స్థాయికి మారుస్తున్నారని పట్టభిరామ్ తెలిపారు.. అలా నగరంలో నుంచి వస్తున్న డ్రెయినేజీ వాటర్ లో దాదాపు 30 శాతం అనగా 370 mld వాటర్ నీ చుట్టు పక్కల ఉన్న టెక్స్ టైల్ పార్క్స్ కి,పరిశ్రమలకి సరఫరా చేస్తున్నారని పట్టాభి తెలిపారు.

స్వయంగా ఈ ఎస్టిపి ప్లాంట్స్, టెరిషరీ ప్లాంట్స్ ద్వారా మురికి నీటిని శుద్ధి చేసే విదానాన్ని అంతా పర్యవేక్షించడం తో పాటు ఆ శుద్ధి చేసిన నీటిని నాతో పాటు మా కార్పొరేషన్ సభ్యుల బృందం తాగారని పట్టభిరామ్ తెలిపారు.. చూడగానే ముక్కు మూసుకుని పక్కకి వెళ్ళిపోయే మురుగునీటిని మార్చి తాగునీటి దశకు తీసుకురావడం నిజంగా గొప్ప విషయమైతే అదే వాటర్ నీ పరిశ్రమలకి కూడా సరఫరా చేసి ఇప్పటివరకూ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ 600 కోట్లు ఆర్జించి ఈ విదానాన్ని ఆదాయ వనరుగా కూడా మార్చుకోవడం చాలా పెద్ద విషయమని పట్టభిరామ్ తెలిపారు.

ఈ స్థాయి టెరిషరీ ప్లాంట్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టాభిరామ్ తెలిపారు.. గతంలో సింగపూర్ లో సూయెజ్ వాటర్ ను ట్రీట్ చేసి డ్రింకింగ్ వాటర్ స్థాయికి మారుస్తున్న విషయం గురించి విన్నామని.. కానీ సూరత్ లో కళ్ళారా చూసామని ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జనసాంద్రత ఎక్కువ కలిగిన తిరుపతి,రాజమండ్రి,విశాఖ పట్టణం,విజయవాడ, నెల్లూరు,కర్నూలు లాంటి అనేక మహా నగరాల్లో పెద్ద ఎత్తున డ్రెయినేజీ ద్వారా వస్తున్న మురుగునీటిని అక్కడ ఉన్న ఎస్టిపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఆధునీకరించి సూయేజ్ వాటర్ నీ డ్రింకింగ్ వాటర్ స్థాయికి మార్చి పరిశ్రమలకి తదితర అవసరాల వినియోగానికి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కృషి చేస్తుందని త్వరలోనే ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్వచ్చాంధ్రా కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డీ పట్టాభిరామ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE