Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి హోదా పక్కన పెట్టి…మానవత్వం భుజాన వేసుకుని

– గూడూరు మండల సర్పంచ్ ల అధ్యక్షుడు బండి రమేష్ అంతిమ యాత్ర లో పాల్గొన్న మంత్రి జోగి రమేష్
– మాజీ మంత్రి పేర్ని నాని తో కలిసి దహన సంస్కారాలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి జోగి రమేష్

ఆప్తుడి కోసం రాష్ట్ర మంత్రి జోగి రమేష్ మానవత్వం ప్రదర్శించారు. ఒక నాయకుడు తనను నమ్ముకున్న అనుచరుడి అంతిమసంస్కారాల్లో పాల్గొనడమే కాదు. పాడె కూడా మోసి నిజమైన నాయకుడయ్యారు. నా అనుకున్న వైసీపీ కుటుంబ సభ్యుడు కోసం మంత్రి హోదా సైతం పక్కన పెట్టారు.. మంత్రిని అన్న విషయం పక్కన పెట్టి మానవత్వం తో అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు.

మంత్రి అయిన రెండవ రోజే సర్పంచ్ బండి రమేష్ అంతిమ యాత్ర లో పాల్గొని ప్రజల మనసును గెలుచుకున్నారు.. గుండె పోటు తో హఠాన్మరణం పాలైన గూడూరు మండల సర్పంచ్ ల అధ్యక్షుడు బండి రమేష్ అంతిమ యాత్ర లో మాజీ మంత్రి పేర్ని నాని తో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ బండి రమేష్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ పాల్గొన్న అంతిమ యాత్ర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మంత్రి జోగి రమేష్ చూపిన మానవత్వం పై మైలవరం నియోజకర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE