కోడై క్యూసింది!

కోటా సరుకులకు క్యూ..
సినిమా టికెట్లకు క్యూ..
ఆస్పత్రుల్లో వైద్యానికి క్యూ..
రైలు,బస్ టికెట్లకు క్యూ..
ఇవన్నీ సహజం..
ఇప్పుడు కొత్తగా
మందు కోసం క్యూ..
బంగారం షాపుల్లో క్యూ..
ఇవి గాక మరో రకం క్యూ లు..
ఇంట్లో బ్లేడుతో తీసుకునే
గోళ్ల కోసం..
మామూలుగా చేసుకునే కాళ్ళ శుభ్రత కోసం _పెడి క్యూ ర్..
సంపదను పోగు చేస్తే ప్రొ క్యూ ర్..
కొందరి ప్రవర్తన పి క్యూ లియర్..
కొన్ని చికిత్సలకు మాలి క్యూ ల్..
అయితే వీటన్నిటి కంటే ప్రమాదకరమైనది..
పక్కింట్లో..ఎదురింట్లో..
నీ ఇంట్లోనే వేరే గదిలో..
వంట గదిలో..
ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకునే…
క్యూ రియాసిటీ..
అలా తెలుసుకున్న సమాచారాన్ని
ఎవరికి..ఎలా…
ఎప్పుడు చేరవేయాలో
బాగా తెలిసిన ఐ క్యూ!

ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply