చెత్త మీద పన్నేసిన చెత్త పాలకుడికి పోయేకాలం దగ్గర పడింది

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

మా ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడుని చూసి ప్యాలస్ పిల్లి భయపడింది. ఉత్తరాంధ్రలో వైసిపి నాయకుల దోపిడి, భూకబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకే బీసీ నేత అయన్నపాత్రుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసారు. అర్దరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి గోడ కేసులో అయన్నపాత్రుడు, రాజేష్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే వారిని విడుదల చేయాలి.

అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకో జగన్ రెడ్డి. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదు. అయ్యన్న పాత్రుడిగారికి అండగా మొత్తం తెలుగుదేశం పార్టీ ఉంది. చెత్త మీద పన్నేసిన చెత్త పాలకుడికి పోయేకాలం దగ్గర పడింది.

మీరు వదిలిన బాణం అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే సమాధానం ఇచ్చింది
బాబాయ్ ని ఒప్పించి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నాయకుడివి అవుతావ్… బాబాయ్ ని లేపేసి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తే నేరస్తుడివి అవుతావ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ రెడ్డి! వివేకా గారిని అత్యంత కిరాతకంగా చంపించింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి.. వారిని కాపాడుతుంది జగన్ రెడ్డి అని షర్మిల సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు…మీరు వదిలిన బాణం అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే సమాధానం ఇచ్చింది.

Leave a Reply