Suryaa.co.in

Andhra Pradesh

జిజిహెచ్ లో సమూల మార్పులు

నెల రోజుల్లో అమాంతం పెరిగిన జిజిహెచ్ ప్రతిష్ట
ఎవరీ డాక్టర్ కిరణ్ కుమార్?
టాక్ ఆఫ్ ధి టౌన్ గా మారిన జిజిహెచ్

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో నెల రోజుల వ్యవధి లో అనేక మార్పులు చోటు చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.అప్పటి వరకు ఆసుపత్రి ని ఎవరికి తోచిన వారు పాగా వేసుకుని వ్యాపారాలు చేసుకున్నారు.. వైద్యులు వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి.

ఆసుపత్రి కి గుండె కాయ వంటి క్యాజువాల్టి ని గాలికి వదిలేయడం…
సమయానికి మినిస్టరియల్ సిబ్బంది ఉండక పోవడం..నిలిచిపోయిన అవయవమార్పిడి శస్త్ర
చికిత్స లు.. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ లు నిలిచి పోవడం.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయక పోవడం వంటి సమస్యలతో కునారిల్లుతోంది. ఈ సమస్యలను పరిష్కరించే వారే లేరా అనుకుంటున్న తరుణంలో డాక్టర్ కిరణ్ కుమార్ జిజిహెచ్ సూపరింటెండెంట్ గా గత నెల 30 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.

ఈయన కూడా డ్యూటీ చేసుకుని నాలుగు ఫైళ్ల పై సంతకం పెట్టి, సాయంత్రానికి ఇంటికి వెళ్ళతారేమోనని అందరూ అనుకున్నారు.

బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నే విశ్వ రూపం చూపించారు. ఇక అక్కడ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అలసట లేకుండా పని చేసుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
నెల రోజుల వ్యవధి లో డాక్టర్ కిరణ్ కుమార్ ఉద్యోగ నిర్వహణ లో
చేసిన అమోఘమైన పనులు రోగుల పై ప్రభావితం చేస్తున్నాయి. ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు ఒకసారి మననం చేసుకొందాం..

జిజిహెచ్ లో అదనంగా మందుల పంపిణి కౌంటర్ ప్రారంభం..
అంతకు ముందు కేవలం మూడు కౌంటర్లు మాత్రమే ఉన్నాయి. పేషంట్లు ఎక్కువ మంది వస్తుందటం తో నాలుగో కౌంటర్ ను ప్రారంభించారు.
జనరల్ మెడిసిన్ విభాగం లో స్ట్రెచర్ పై రోగులు ఉండటాన్ని గమనించి 50 పడకలను అందుబాటులో తెచ్చారు.

ఈ విభాగానికి రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో మంజూరు చేసి ఖాళీగానున్న 200 పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపించారు.అనేక సంవత్సరాలు నుంచి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సంగతి ఎవరు పట్టించు కోలేదు.
ఈ పోస్టులు భర్తీ అయితే నిరుద్యోగులు ఉద్యోగాలు పొందతారు. అటు రోగులకు సేవలు అందుతాయి.

ఆసుపత్రి లో అవయవ మార్పిడి ఆపరేషన్ లు రెగ్యులర్ గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కోవిడ్ సమయం లో ఆగిపోయిన శస్త్ర చికిత్స లు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్లు కేటాయింపు. గతంలో లో ఇంత భారీ బడ్జెట్ కేటాయించలేదు. తొలిసారిగా అయిదు కోట్లు ఇవ్వడం ఇదే ప్రధమం.
ప్రసూతి, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగం ఆధునీకరించేందుకు 70 లక్షలు మంజూరు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ముందుకు వచ్చి ప్రభుత్వం తో ఒప్పందం కుదిరింది.
దీనివల్ల గర్భిణులకు మెరుగైన సేవలు అందుతాయి.

పొదిల ప్రసాద్ భవనం లో ఉన్న మందుల పంపిణి కేంద్రాన్ని తిరిగి ప్రారంభించారు. మందుల కోసం పాత ఆసుపత్రి కి వెళ్లడం కష్టంగా మారడటం తో తిరిగి మందుల కౌంటర్ ప్రారంభించారు.
అత్యవసర రోగులకు అందుబాటులో ఉండేందుకు క్యాజువాల్టి లో రెండో సూపరింటెండెంట్ కార్యాలయం ను ఏర్పాటు చేశారు.

ఒ పి లో చికిత్స కోసం వచ్చిన రోగులకు మూత్రశాల లేకపోవ డాన్ని గుర్తించారు.
వెంటనే రోగులకు అందుబాటులో తెచ్చి కష్టాలు తీర్చారు.
అత్యవసర చికిత్స లు జరుగుతున్న సమయం లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్ లు లేకపోవడం గుర్తించారు.

సి టి వి ఎస్ విభాగం వైద్యులు అందుబాటులో లేకపోవడం ను డి యం ఈ దృష్టికి తీసుకుని వచ్చారు. ఒకరికి బదిలీ చేయగా మరో ఇద్దరికి మెమో లు జారీ చేశారు. దాంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. ఉదయం 8.30 గంటలకు డ్యూటీ కి రావడం కనిపిస్తోంది.

కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ల కోసం 20 లక్షల తో పరికరాన్ని కొనుగోలు చేశారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి పరిపాలన అధికారి కార్యాలయం వరకు అనేక సంవత్సరాలనుండి మూలాన పడేసిన బీరువాలు, ఫైళ్ల ను దుమ్ముదులిపారు.
అక్కడ నుంచి వాటిని తీసి వేయడం తో పరిశుభ్రత కనిపించింది.

ఒ పి లో పని వేళలను మార్పులు తీసుకుని వచ్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు
ఒ పి రిజిస్ట్రేషన్ కేంద్రాలను రోగులకు అందుబాటులో తెచ్చారు.
గోడలపై అస్తవ్యస్తంగా ఉన్న స్టిక్కర్ల పై యుద్ధం ప్రకటించారు. ఆసుపత్రి గోడలపై ఉన్న స్టిక్కర్ల ను వరుసగా నాలుగు రోజుల పాటు స్టిక్కర్లను తొలగించి పరిశుభ్రత చేశారు.

రోగులకు సేవలు అందించడం లో వైద్యులు బిజీ బిజీ గా ఉంటున్నారు. సకాలంలో వారికీ భోజనం లేకపోవడం తో రోగి సేవల పై దృష్టి పెట్టలేక పోతున్నారు. వారికి సకాలంలో భోజనం అందించాలని క్యారాజ్ లను ఏర్పాటు చేశారు.

డాక్టర్ల భోజనశాల లో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే గోడలకు రంగులు వేయించారు. అప్పటికప్పుడు రెండు ఏ సి లను అందుబాటులో తెచ్చారు. ప్రత్యేకంగా కుర్చీలు తీసుకుని వచ్చారు. వైద్యులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.
ఓపి కేంద్రాల వద్ద రోజుకు రెండు వేల నుంచి మూడు వేలకు వస్తున్నారు. దాంతో ఒ పి వద్ద రోగుల తాకిడి పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరో పది ఒ పి కేంద్రాలను అందుబాటులో తెస్తున్నారు. నిర్మాణ పనులు చక చక సాగుతున్నాయి.

అసంపూర్తి గా నిలిచి పోయిన సర్వీస్ బ్లాక్ ను తిరిగి ప్రారంభించెందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 2018 లో మొదలు పెట్టిన ఈ భవనం పూర్తి చేసేందుకు ఎవరు పట్టించు కోలేదు.
నాబార్డ్ ద్వారా పది కోట్ల తో ఈ భవనాన్ని పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఆపరేషన్ దియేటర్లను ఆధునికరిస్తున్నారు.. అవసరమైన చోట పరికరాలను అందుబాటులో కి తెచ్చారు. మూడో ఆపరేషన్ దియేటర్ ను గ్యాస్ట్రో ఏంట్రాలజీ విభాగానికి ఇవ్వాలని నిర్ణయించారు.
క్యాజువాల్టి మైనర్ ఒ టి ను కూడా ఆధునికరించారు. గతంలో ఈ. దియేటర్ లో పని చేయాలంటే కష్టం గా ఉండేది. ఇప్పుడు ఆధునిక పరికరాలు అందుబాటులో తీసుకునివచ్చారు.
జాతీయ స్థాయి లో జిజిహెచ్ కు రెండో స్థానం దక్కింది.

ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడం లో ఇండియా లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి రెండో స్థానం దక్కింది. గత రెండ, మూడు రోజులుగా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఈ ఘనత ను సాధించారు.

ఆసుపత్రి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండో శుక్రవారం గ్రీవెన్స్ కమిటీ ని నియమించారు. మొదటి సమావేశం పూర్తి చేశారు.
కొత్త పది ఒ పి కేంద్రాల నిర్మాణం కోసం రెండు లక్షలు ప్రకటించారు మాస్కాన్ అధినేత డాక్టర్ ఆదినారాయణ.

మరికొంత మంది దాతలు ఆసుపత్రి అభివృద్ధి కోసం గ్లౌజ్ లు, మాస్క్ లు, సబ్బులు అందచేశారు. ఎముకలు కీళ్ళ విభాగానికి పరికరాలను అందచేశారు. వాటర్ కూలర్ లను అందచేశారు.
అక్రమ వ్యాపారస్థులపై కోరడ ఝాలిపించారు. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్థులకు క్లాస్ తీసుకున్నారు.

పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యత కల్పించారు.
సెక్యూరిటీ, సానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.
ఆరోగ్య మిత్రల పని తీరు ను మెరుగు పడటం. ప్రధాన ఒ పి ల వద్ద ఆరోగ్య మిత్రల కౌంటర్ల ఏర్పాటు.

క్యాజువాల్టి లో 24 గంటల వైద్య సేవలు.. షిఫ్ట్ ల వారీగా ఆర్ యం ఒ ల నియామాకం..
ఆసుపత్రి బయట ఆక్రమణాల తొలగింపు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించారు.
రాత్రి పూట మహా ప్రస్థానం వాహనాలను అందుబాటులో తీసుకుని రావడం జరిగింది.

– పులగం సురేష్‌
జర్నలిస్టు

LEAVE A RESPONSE