Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రఘురామకృష్ణరాజు భేటీ

అమరావతి : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్లమెంట్ లోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలిశానని, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తనను నామినేట్ చేసినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశానని రఘురామ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కూడా రఘురామకృష్ణరాజు కలిశారు.

LEAVE A RESPONSE