– అప్పుడు నాకు రెండు ఆటోలు ఉండె
– ఇప్పుడు అవి అమ్ముకుని డ్రైవరునయ్యా
– కాంగ్రెస్ పుణ్యాన ఉన్నవీ పాయె
– నాడు రాహుల్‌గాంధీ ఎక్కిన ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీ అరిగోస
– తన ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌తో తన వేదన పంచుకున్న మష్రత్ ఆలీ
– కాంగ్రెస్ పాలనలో దిగజారిన ఆటో డ్రైవర్ల సమస్యల పైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్
– జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వర కు మష్రత్ ఆలీ ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
(సుబ్బు)
హైదరాబాద్: ‘‘ రాహుల్‌గాంధీ లాంటి పెద్ద నాయకుడు నా ఆటో ఎక్కిండని సంబరపడ్డా. రాహుల్ సాబ్ నా ఆటో ఎక్కిండని తెలిసి నా దోస్తులు, బంధువులు నన్నో హీరో లెక్క చూశారు. ఆ ఎన్నికల్లో మా ఆటో డ్రైవర్లకు మేలు చేస్తాడని చెబితే నిజమనే నమ్మా. అప్పుడు నాకు సొంతంగా రెండు ఆటోలుండె. కాంగ్రెస్ సర్కారు వచ్చి, మహిళలకు బస్సుల్లో ఫ్రీ టికెట్ ఇచ్చినంక.. అవన్నీ పోయి, ఇప్పుడు కాలీ డ్రైవరుగా మిగిలినా సారూ’’
– ఇది గత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీని తన ఆటోలో సగర్వంగా ఎక్కించుకుని, ఆయనను సిటీలో తిప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ పుణ్యాన, ఉన్న రెండు ఆటోలు పోయి డ్రైవరుగా మిగిలానంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు తన అరిగోస వెళ్లబోసుకున్న ఆటోడ్రైవర్ మష్రత్ ఆలీ కథ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వచ్చి వారికి తీరని ప్రోత్రోహం చేస్తున్న తీరును ఎండగడుతూ ఈరోజు భారత రాష్ట్ర సమితి నేతలంతా హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సాధక బాధాకలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వారి ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పరిస్థితిలను స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు.. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లాలని వెళ్లానని తెలిపిన ఆలీ, ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్ గా కూలీగా పనిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్ల మష్రత్ అలీ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకొని ఆ తర్వాత, అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు.