– భీమవరం అంటే మర్యాద
కార్యకర్తల సమావేశంలో బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
భీమవరం: 25 జిల్లా ల్లో సారథ్యం యాత్ర పూర్తి చేసుకుని భీమవరం వచ్చాను నాకు అపూర్వ స్వాగతం లభించింది భీమవరం దద్దరిల్లేవిధంగా ఉప్పెన లా కార్యకర్తలు తరలివచ్చారు సాధారణ కార్యకర్తలు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్య సభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ శోభాయాత్ర తో భీమవరం కాషాయ మయం చేశారు
భీమవరం అంటే మర్యాద. భీమవరం పట్టణానికి విశాఖ కు సంబంధం. “ఒకటిన్నర సంవత్సరం లో స్వాతంత్ర్య పోరాటం. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు
11వేల 44 కోట్ల నిధులు స్టీల్ ప్లాంట్ కు తీసుకు వచ్చినందుకు భూపతిరాజు శ్రీనివాస వర్మ కు కృతజ్ఞతలు గత ప్రభుత్వ వైఫల్యం వల్లే కోనసీమ కు రైల్వే లైన్ లేదు
అయితే కూటమి ప్రభుత్వం కృషి వల్ల కోనసీమకు రైల్వే కూత వినపడుతుంది. భీమవరానికి విదేశాల్లో మంచి పేరు ఉంది.
ట్రంప్ వల్ల ఆక్వా రంగం ఇబ్బందులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయం లో ఆరాతీశారు. ఇది కష్ట కాలం స్వదేశీ ఉద్యమం ద్వారా ముందు కు వెళ్ళాలి కొంత సహనం అవసరం అని నరేంద్ర మోడీ అన్నారు ట్రంప్ దిగివచ్చే రోజు వస్తుంది అని మాధవ్ అభిప్రాయపడ్డారు
చేనేత ను కాపాడుకోవాలి. నరేంద్ర మోడీ, విశ్వకర్మ పుట్టిన రోజు 17వ తేదీ. అదేరోజు సృష్టి పేరు తో రాష్ట్ర రాజధాని లో భారీగా చేయబోతున్నాం.
భరతమాత కు విదేశాల్లో గౌరవం పెరిగింది. మా పూర్వీకులు భారత్ లో ఉన్నారని విదేశాల్లో ఉన్న భారతీయులు చెబుతున్నారు.నరేంద్ర మోడీ సారథ్యంలో స్పూర్తి తో పని చేద్దాం అని మాధవ్ పిలుపు ఇచ్చారు
అనేక సంవత్సరాలు గా కార్యకర్తలు పని చేస్తున్నారు. బిజెపి ఒక విభిన్నమైన పార్టీ.
కృషి పట్టుదల ఉంటే బిజెపి లో పదవులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.