Suryaa.co.in

Telangana

ఎయిర్‌పోర్టులను తలదన్నేలా రైల్వేస్టేషన్లు

– 106 అమృత్ స్టేషన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా.. వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్

వరంగల్: మోడీ నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన రైల్వే స్టేషన్లు. ఎయిర్పోర్టులను తలపించే పద్ధతిలో రైల్వే స్టేశన్లు అభివృద్ధి చెందుతున్నాయి.

స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో.. ఈ పది సంవత్సరాల కాలంలో అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సజీవ సాక్ష్యం చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ, నాంపల్లి ఇలా 106 రైల్వే స్టేషన్లు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందందే దేశం అభివృద్ధి చెందదు. రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ, అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందని చెప్పి మోడీ భావిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

LEAVE A RESPONSE