Suryaa.co.in

Telangana

రాజాసింగ్ అబద్ధాలాడారు

– అభయ్‌పాటిల్ నామినేషన్ వేయమని చెప్పారు
– కానీ ఆయన పోటీకి పదిమంది ప్రపోజర్లు లేరు
– అందుకే నామినేషన్‌కు అవకాశం ఇవ్వలేదని అబద్ధాలాడారు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ స్పష్టీకరణ

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాన్ని కేంద్ర మంత్రి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే నుండి తీసుకున్నారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ తో రాజాసింగ్ మాట్లాడారు. అప్పుడు అభయ్ పాటిల్ … ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ. ఎవరైనా నామినేషన్ వేయొచ్చు. మీరు నామినేషన్ దాఖలు చేయండని స్పష్టంగా చెప్పారు.

అయితే పార్టీ నియమావళి ప్రకారం, నామినేషన్ ఫారం చెల్లుబాటయ్యేందుకు పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంతకాలు తప్పనిసరి. ఈ విషయాన్ని రాజాసింగ్ కి రిటర్నింగ్ అధికారులే చెప్పారు. మీకు 10 మంది సభ్యుల సంతకాలు అవసరం. వాటితో కూడిన నామినేషన్ ఫైల్ చేయండి అని సూచించారు.

కానీ, రాజాసింగ్ బయటకు వచ్చి.. వారికి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బద్నాం చేసేలా.. అబద్ధాలు చెప్పారు. పార్టీ రాజాసింగ్ కి నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని చెబుతూ పార్టీపై అభాండాలు వేసే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత రాజాసింగ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆ రాజీనామా పత్రాన్ని జాతీయ పార్టీకి పంపించబడుతుంది. కానీ నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజాసింగ్ డైరెక్టుగా స్పీకర్ గారికి ఇవ్వాల్సింది.

రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం గతంలోనూ పలు సందర్భాల్లో బయటపడింది. ఆ కారణంగా ఆయన పార్టీ నుండి సస్పెండ్ కూడా అయ్యారు. అయినా పార్టీ వారికి అనేక అవకాశాలు ఇచ్చింది. ఈసారి మాత్రం స్వయంగా రాజాసింగ్ రాజీనామా చేశారు.

LEAVE A RESPONSE