కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పడం అబద్ధమని, కాంట్రాక్టు కోసమే రాజీనామా చేసింది వాస్తవమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మునుగోడ్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో గల బస్టాండ్ వద్ద నుండి పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచారం ప్రారంభించి అంగడి బజార్, ముదిరాజ్ కాలనీ, రచ్చబండ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్ళి కారు గుర్తుకే ఓటేయాలని కోరుతూ కరపత్రాలను అందజేసి ప్రచారం నిర్వహించారు.

స్థానికంగా గల వేణు గోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారం సందర్భంగా మహిళలు మంత్రికి నుదుటన కుంకుమ దిద్దిమంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పారు. మునుగోడ్ నియోజకవర్గ పరిధిలో కూడా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా అని ప్రశ్నించారు.

మూడున్నర సంవత్సరాల పాటు MLA గా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా? పార్టీ మారిన తర్వాత గుర్తుకొచ్చిందా? అన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసమే ఈ ఎన్నికలు వచ్చాయనిtsy2 ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమనే పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న TRS వెంటే ప్రజలు ఉన్నారని, TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు.

ఇప్పటి వరకు మునుగోడ్ నియోజకవర్గానికి ఏం చేశారో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. చేసింది చెప్పకుండా BJP నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికల లో ఎలాగైనా గెలవాలని కుట్రలు చేస్తుందని చెప్పారు. ప్రచారంలో MPTC వెంకన్న గౌడ్, సర్పంచ్ కృష్ణారెడ్డి, ZPTC AV రెడ్డి, సీనియర్ TRS నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కటికం సత్తయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply