ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ దుకాణాల బంద్‌కు రేషన్ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకణాల్లో రేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పీఎంజీకేఏవై (ప్రధానమంత్రి గరీబ్ కల్యాన్ యోజన్) కమిషన్ బకాయిలు ఇవ్వాలని డీలర్ల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఇచ్చిన కందిపప్పు నగదు బకాయిలు చెల్లించాలి. గోనెసంచులు ఇస్తే రూ.20 ఇస్తామని సర్క్యూలర్ ఇచ్చారు. సంచులు ఇచ్చినా చెల్లింపులు ఉండవని ఇప్పుడంటున్నారు.