Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం:పరిపూర్ణానంద స్వామి

బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణ నందస్వామి సోమవారం బద్వేల్ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాజకీయాలంటే ఎమోషన్స్ కాదని తెలిపారు. బద్వేలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ బద్వేలు అభివృద్ధిపై దృష్టి సారించలేదని తెలిపారు. బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అడుగడునా రోడ్లు గుంతలమయమన్నారు. కొన్ని పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నామని ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని తెలిపారు. బీజేపీ పార్టీ నిబద్ధతతో రాజకీయాలు చేస్తుందని స్వామీజీ చెప్పారు.
బద్వేలులో బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ విద్యావంతుడని… విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం విద్యావంతుడిని అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. బద్వేలు అభివృద్ధి కావాలంటే పనతల సురేష్‌ను బద్వేలు ప్రజలు గెలిపించుకోవాలని అన్నారు. అసెంబ్లీలో బద్వేలు అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తి సురేష్ అని చెప్పుకొచ్చారు. ఎమోషన్లు కావాలో అభివృద్ధి కావాలో బద్వేలు ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అని స్పష్టం చేశారు. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో వ్యక్తినే ఎన్నుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పరిపూర్ణానంద స్వామి కోరారు.
బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పీఠం స్వామీజీ పరిపూర్ణానంద స్వామి గారు బద్వేల్ లోని ఒక హరిజన వాడకు ప్రచారానికి వెళ్లారు. ఆ వాడలో ఇళ్లు ఎప్పుడు పడిపోతాయో అనే విధంగా ఉన్నాయి. ఆ కాలనీవాసులను స్వామీజీ మీకు ఏమి కావాలి అని అడిగితే.. మాకు రామాలయం నిర్మించి ఇవ్వండి స్వామీజీ అని అడిగారు. స్వామీజీ మీకు నిలవడానికి సరిగా నీడ లేదే ముందు గూడు చూసుకోండి అంటే… మేము ఎప్పటి నుంచో ఈ రకమైన ఇళ్లల్లో ఉంటున్నాము. కానీ మాకు రామాలయం కావాలి అని వేడుకున్నారు. వెంటనే స్వామీజీ స్థలం ఎక్కడ ఉందని అడిగారు. వారు వెంటనే కాలనీ వాసులందరూ ఒక పది సెంట్లు స్థలాన్ని ఎవరికి ఇబ్బంది లేని స్థలాన్ని చూపించారు.
వారి వెంట పర్యటనలో ఉన్న బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కట్టు దేవానంద్ గారు లక్ష రూపాయలు వెంటనే ప్రకటించారు వారితో పర్యటనలో ఉన్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సురేష్ మీరు నాకు ఓటు వేసినా, వేయకపోయినా నేను గెలిచినా, ఓడినా ఈ కాలనీలో ఖచ్చితంగా రామాలయం నిర్మాణానికి కృషి చేస్తాను అని వాగ్దానం చేశారు ఆ కాలనీలో 70 కుటుంబాలు ఉన్నాయి వారందరూ మేము ఖచ్చితంగా బిజెపికి ఓటు వేస్తాము అని బహిరంగ ప్రకటన చేశారు. కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు,ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల వెంకటేష్ యాదవ్ , బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE