– అవి కాగ్ లెక్కలా? చంద్రబాబు కాకి లెక్కలా?
– కమెడియన్లు, సైడ్ యాక్టర్స్ కు ఉన్న విలువ పవన్ కు లేదు..!
– వాళ్ళల్లో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలయ్యారు.. పవన్ మాత్రం కాలేకపోయాడు
– నిత్య కళ్యాణాలతో పవన్ తన పేరును సార్థకం చేసుకున్నాడు
– ఎక్కడ ఎవరికి తాళి కట్టేస్తాడో అని ఆడపిల్లలు పవన్ ను చూసే భయపడుతున్నారు
– వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు అత్యంత గర్హనీయం.. తీవ్రంగా ఖండిస్తున్నాం
– ధైర్యముంటే.. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పండి.
– పవన్ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే ప్రజలే చెప్పులు చూపిస్తారు
– రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
నిరాశ, నిస్పృహలో పవన్:
వారాహి రెండో విడత యాత్రలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు దారుణం. తీవ్ర నిరాశతో ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయంగా ఎదగలేనని, తనకు ఎవరూ ఓట్లు వేయరని, ఎమ్మెల్యేను కూడా కాబోనని, తానసలు రాజకీయాలకు పనికి రానని ప్రజలు అనుకుంటున్నారన్న ఆవేదన, బాధలో ఉన్నట్లున్నాడు. అందుకే ఒక ఉన్మాది మాదిరిగా మాట్లాడాడు.
పవన్ పిచ్చి వాగుడు:
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేనా అవి? సరిగ్గా 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ స్థాపించి 10 ఏళ్లు అయిందని చెప్పాల్సిన నాయకుడు ఏం చెప్పాలి? తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాననేది చెప్పాలి. తాను 10 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నానని చెప్పాలి. అధికారంలోకి వస్తే పేదలకు మంచి చేస్తానని చెప్పాలి. అంతే కానీ నిత్యం సీఎంని, ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ, హావభావాలు ప్రదర్శించడం సరికాదు. నిన్నటి పవన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు కూడా ఖండించాలి.
అవాస్తవాలతో విమర్శలు:
పవన్ కళ్యాణ్ మాటలు కిరాయి కార్యకర్తలకు లేదా ఆయన అభిమానులకు రుచించవచ్చు. కానీ ఆయన మాటల్లో ఎక్కడా వాస్తవం లేదు. విమర్శలు చేస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నట్లున్నాడు. ఆయనకు ప్రసంగాల్లో చెప్పు ఎత్తి చూపడం అలవాటు. కానీ ఆయన నిన్నటి మాటలు విన్నాక, ప్రజలు కూడా చెప్పు చూపించే పరిస్థితి వస్తోంది.
పవన్ కాకి లెక్కలు:
నిన్న ఏవేవో లెక్కలు చెప్పే ప్రయత్నం చేశాడు. అవి కాగ్ లెక్కలో లేక చంద్రబాబు ఇచ్చిన లెక్కలో.. లేక కాకి లెక్కలో తెలియదు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారనేది పవన్ తెలుసుకోవాలి. ఒక రిపోర్టును ప్రస్తావించినప్పుడు, దాని గురించి స్పష్టంగా చెప్పాలి. ఏదో ఎన్‌సీపీ రిపోర్టు అన్నాడు. దాని గురించి వెతికితే అది లేనే లేదు. అమ్మాయిల మిస్సింగ్ వివరాలు ఎక్కడివని ఆరా తీస్తే, అది చివరకు ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అని తెలిసింది. దాని గురించి ప్రస్తావిస్తూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
ఏనాడైనా గౌరవించావా?:
జగన్‌కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇక నుంచి తాను ఏకవచనంతో మాట్లాడతానని అన్నాడు. కానీ ఆయన ఏనాడు జగన్‌గారికి గౌరవం ఇచ్చాడు…? కేవలం చంద్రబాబుకు తప్ప, పవన్ ఎవరినీ గౌరవించలేదు. గతంలో చాలాసార్లు జగన్‌రెడ్డి అనే ఏకవచనంతోనే సంబోధించాడు. సినిమాల్లో మాదిరిగా ఇలాగే మాట్లాడితే.. 2024 ఎన్నికల్లోనూ నీకు ఘోర పరాభవం తప్పదు. డిక్కీ బలిసిన కోడి వచ్చి, చికెన్ షాప్ ముందు తొడ గొడితే ఏం జరుగుతుందో, అదే నీకు జరుగుతుంది.
ఆయనతో నీకు పోలికా?:
జగన్‌కి, నీకూ పోలిక ఎక్కడుంది? జగన్‌గారు 2011లో పార్టీ పెట్టి, ప్రజల్లో పోరాడి నిల్చారు. 2014లో విపక్షంలో నిల్చినా, ఎక్కడా తగ్గలేదు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. వారి మనసు గెల్చుకున్నారు. అఖండ విజయం సాధించారు. మరి నీవు ఎప్పుడో 2008లో యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలు మొదలు పెట్టావు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, కనీసం ఒక్క సీటు కూడా గెల్చే స్థితిలో లేవు.
అందుకే నీవు ఎదగలేదు:
సినిమాల్లో కమెడియన్లు, యాక్టర్లు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులు కూడా అయ్యారు. కానీ నీవు ఏమీ కాలేకపోయావు. ఎందుకో తెలుసా? సినిమాల్లో పవన్‌స్టార్‌వి అని చెప్పుకున్నా ఏమీ కాలేకపోయావు. మన హావభావాలు, మన మాటలు, లేని నిలకడతనం, కనీస విషయ పరిజ్ఞానం, ఆలోచనలు, సిద్ధాంతాలు లేని పార్టీ. మన మాటలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తన.. వంటివన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజలు ఆదరిస్తారు. ఒకసారి గమనించాలి కదా? నీతో కలిసి సినిమాల్లో పని చేసిన కమెడియన్లు రాజకీయాల్లో ఎదిగినా, మీరు ఎదగలేదు. ఎందుకంటే నీకు నిలకడ లేదు.
మాపై నిందలు ఎందుకు?:
అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చే తల్లి, ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్యను.. నీ అవసరం మేరకు వారిని ఉపయోగించుకుంటున్నావు. నీ తల్లిని కానీ, నీ భార్యను కానీ మా పార్టీవారు ఎప్పుడైనా, ఏమైనా అన్నారా? నీ తల్లిని అగౌరవపర్చింది తెలుగుదేశం పార్టీ అని గతంలో నీవే ప్రకటించావు. ఆ పార్టీకి కొమ్ము కాసే పత్రికలు, ఛానళ్లు నీ తల్లి గురించి వార్తలు వేశాయి. వారిని విడిచిపెట్టి మమ్మల్ని అంటున్నావు ఎందుకు? అసలువారు కదా నీ తల్లిని అవమానించింది. నీ మూడో భార్యకు విడాకులు ఇస్తున్నావని, టీడీపీ అనుకూల మీడియా కదా ప్రసారం చేసింది. మరి వారిని వదిలేసి మమ్మల్ని ఎందుకు అంటున్నావు?
అక్కడేమో ఎంజాయ్‌స్టార్:
పవన్, నీకు ఎందుకంత ఆక్రోశం? నిన్ను ప్రజలు ఓడించారన్న కోపం. వారంతా జగన్‌గారికి ఓట్లు వేస్తున్నారన్న బాధ నీలో కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ఎంజాయ్… ఇక్కడ గంజాయి వేస్తున్నావా? అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావా? అక్కడేమో ఎంజాయ్‌స్టార్‌వి. అక్కణ్నుంచి గంజాయి తెచ్చుకుని, ఇక్కడ వేసుకుంటున్న గంజాయిస్టార్‌వి. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.
వాలంటీర్లపై ఏమిటా ఆరోపణలు!:
వాలంటీర్ల వ్యవస్థ ఏం చేసింది. దాన్ని ప్రధాని సైతం అభినందించారు. చివరకు ముస్సోరిలో ఐఏఎస్‌లకు శిక్షణలో కూడా ఆ అంశాన్ని చేర్చారు. కోవిడ్ సమయంలో వలంటీర్ల సేవలు దేశంలోనే ఆదర్శంగా నిల్చాయి. వారి గురించి ఏం మాట్లాడావు? వాలంటీర్లు ప్రజల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారా? ఇళ్లలో యువతులు, ఆడవారి గురించి సమాచారం ఇస్తున్నారా? నిజానికి నిన్ను చూస్తేనే ప్రజలు.. ముఖ్యంగా యువతులు భయపడుతున్నారు. ఎవరు, ఎక్కడ కనిపిస్తే తాళి కడతావోనని భయపడుతున్నారు. వలంటీర్లు తమ సేవలతో ప్రజల మనసు గెల్చుకున్నారు. వారికి ప్రతి అడుగులో సేవలు చేస్తున్నారు. కోవిడ్ సమయంలో 16 కోట్ల మాస్క్‌లు పంపిణీ చేశారు. ప్రతి నెలా 1న ఇంటి తలుపు తట్టి, పెన్షన్ ఇస్తున్నారు. వలంటీర్లలో దాదాపు 60 శాతం మహిళలు ఉన్నారు.
ధైర్యముంటే ఆ మాట చెప్పండి:
ఒకవేళ వలంటీర్లు అలాంటి వారైతే, నీవు, నీ పార్టనర్ అధికారంలోకి వస్తే, వారిని తొలగిస్తామని చెప్పండి. దాదాపు 2.5 లక్షల మంది వలంటీర్లు విశిష్ట సేవలందిస్తూ, ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ల ద్వారా ఆదుకుంటోంది. వారి గురించి ఏమిటా నిస్సిగ్గు మాటలు? నీకు చంద్రబాబుపై ఎంత ప్రేమ ఉన్నా.. ఏమిటా మాటలు?
ప్యాకేజీ కోసమే పార్టీనా?:
నీవు చంద్రబాబుకు సేనాధిపతి అని చెప్పుకునే పరిస్థితికి చేరావు? నీవు అసలు పార్టీ నడపడం ఎందుకు? పార్టీని తెలుగుదేశంలో కలిపేయొచ్చు కదా? ఇక్కడ ఒకటుంది. నీ బ్యానర్‌ను టీడీపీలో కలిపితే డబ్బులు రావు. అందుకేనా ఈ రాజకీయాలు? నీ బ్యానర్ నీకుండాలి. తెలుగుదేశం కోసం పని చేయాలి. డబ్బులు తీసుకోవాలి. అదే నీ రాజకీయం?. ఏమిటా పిచ్చి మాటలు. కనీసం అవగాహన, అలోచన లేకుండా ఏమిటా మాటలు?.
ఈరోజు ఎక్కడైనా, ఎప్పుడైనా.. ఒక పార్టీ నాయకుడికి, అధికారంలోకి రావాలన్న తపన ఉంటుంది. అంతేకానీ, తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ నడపడం, వారి నుంచి నెలా నెలా ప్యాకేజీ తీసుకోవడం.. ఇదేనా రాజకీయం? వారాహి విజయయాత్ర ఏమిటి? దేనికి నీ విజయయాత్ర? చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం, ఆయన ఇచ్చే డబ్బుల కోసం మా ప్రభుత్వాన్ని, సీఎంగారిని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నావు.
ముగ్గురూ కలిసే రావొచ్చు కదా?:
నీ మాటలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా వవన్ నీ పద్ధతి మార్చుకో. కనీసం ఎమ్మెల్యేగా గెలిచే ప్రయత్నం చేయి. చంద్రబాబుతో కలసి సీట్లు పంచుకోవడం, పోటీ చేయడం కాదు. అవన్నీ చేస్తుంటే, ప్రజల్లోకి ఎలా వెళ్తారు? వారికి ఏమని చెబుతారు? ఆయనేమో హైదరాబాద్‌లో ఉంటాడు. ఆయన కొడుకు పాదయాత్ర పేరుతో తిరుగుతాడు. మీరు వారాహి యాత్ర అంటూ వస్తున్నారు. ముగ్గురు వేర్వేరుగా ఎందుకు? అంతా కలిసి రండి. ఒకే వేదికపై మాట్లాడండి. మీకు ధైర్యం ఉంటే, మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి.
ప్రజలే చెప్పు చూపిస్తారు:
అంతే కానీ, పది మంది చప్పట్లు కొడుతున్నారని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. వారు కూడా మీకు చెప్పు చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని, నిత్య పెళ్లికొడుక్కు తెలియజేస్తున్నానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.