-రామరాజ్యం రావాలి
-రామాలయాలను దర్శించుకున్న కన్నా
రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను ఆయన దర్శించుకున్నారు. శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలన అన్నారు. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోంది. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. మరి కొద్దిరోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అంది రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.