ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ రామరాజ్యం

-రావణాసురుడిని శ్రీరాముడు వధించినట్లుగానే…ప్రజలు జగనాసురుడిని వధించాలి
-సర్వేలన్నీ ఎన్డీయే గెలుపు ఖాయమని చెప్తున్నాయి
-జగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు
-జగన్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకుంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అనుమతిస్తారా?
-వైసీపీవి నవరత్నాలు కాదు..నకిలీ రత్నాలు
-గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామా…ఇప్పుడు గులకరాయి డ్రామా
-సంపద చెట్లకు కాయదు…కష్టపడి పనిచేయాలి
-మద్యంలోనూ రక్తాన్ని తాగే దుర్మార్గుడు జగన్
-కమీషన్ల కక్కుర్తితో బందరు పోర్టు సర్వనాశనం
-చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం…చేనేతలను ఆదుకుంటాం
-పెడన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

పెడన : వల్లభనేని బాలశౌరిని ఎంపీగా, కాగితపు కృష్ణప్రసాద్‌ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరడానికి నేను, పవన్ కళ్యాణ్ లు ఇక్కడికి వచ్చాం. కృష్ణ ప్రసాద్ తండ్రి కాగితపు వెంకట్రావు బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడు. వారి ఆశయాలను కొనసాగిస్తున్న కృష్ణప్రసాద్‌ను ఆశీర్వదించండి. పొత్తుల ధర్మంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొనకళ్ల నారాయణ రావు సీటు కోల్పోయినా, ఒక్క మాట మాట్లాడకుండా కూటమి అభ్యర్ధులను బలపరిచిన నాయకుడు. ఆయనను గౌరవించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది.

వేదవ్యాస్ కుటుంబం సుదీర్ఘ రాజకీయ అనుభవం గల కుటుంబం. 1978 లో వేదవ్యాస్ గారి తండ్రి నాతో ఎమ్మెల్యేగా చేశారు. ఈ పొత్తుల్లో వారికి న్యాయం చేయలేకపోయాం. అయినప్పటికీ వారు ఎంతో హుందాగా ముందుకొచ్చి పార్టీ నిర్ణయానికి కట్టుబడి కూటమి అభ్యర్ధులను బలపరిచారు. జనసేన నేతలు బండిరెడ్డి రామకృష్ణ, గుత్తికొండ రాజబాబు లు ప్రాణ సమానులు.

శ్రీరాముడు రావణాసురుడిని వదించినట్లు ప్రలు జగనాసురిడిని వధించాలి
మూడు పార్టీల కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రతీ జనసేనికుడు ఎక్కడికి వెళ్లినా ఎంతో ఉత్సాహంతో గుండె ధైర్యంతో ఉన్నారు. జగన్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకుంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అనుమతిస్తారా? అని అడుగుతున్నా. ఈ రోజు శ్రీరామనవమి. ఒక శుభదినం. ఈరోజు సైతం మీరందరు ఈ సమావేశానికి వచ్చి ఆశీర్వదించారంటే కూటమిని ఎవరూ ఆపలేరు. నేడు ప్రజలు శ్రీరాముల వారి కళ్యాణం చేసి మంచి పాలన కావాలని కోరుకుంటారు. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. సుపరిపాలన అంటే రామరాజ్యం గుర్తుకొస్తుంది. కూటమిని ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించే భాధ్యత మేం తీసుకుంటాం. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుడిని వదించినట్లు మీరు జగనాసురిడిని వధించాలి.

ఏ సర్వే చూసినా ఎన్డీయే కూటమి ఘన విజయం
పెడన ప్రజలు ఆనందంగా ఉన్నారా? అని అడుగుతున్నా. అన్ని వర్గాలను నట్టేటిలో ముంచిన వ్యక్తి సైకో జగన్. నేను జే-గన్ రెడ్డి అని ఈ సైకో పేరు మార్చుతున్నా. నిన్న అనేక సర్వేలు వచ్చాయి. అందులో 11 సర్వేలలో కూటమి 17-23 ఎంపీ సీట్లు మనమే గెలవబోతున్నామని చెప్పారు. బాలశౌరి, కృష్ణప్రసాద్ ల గెలుపు తధ్యం. జగన్ రెడ్డి అనే దుర్మార్గుడు పరదాలు కట్టుకుని తిరగాడు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం అనుకుని ఉంటే బయట కాలు కూడా పెట్టేవాడు కాదు. పాదయాత్రలో బుగ్గలు నిమిరి, ముద్దులు పెడితే మీరందరు ఐస్ మాదిరి కరిగిపోయారు. ఐదేళ్లు గడిపోయింది. ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి గుద్దిన గుద్దులకు మీరు అలసిపోయారు. ఇప్పుడు జగన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చేస్తున్నారు.

డ్రామాల రాయుడు జగన్ మళ్లీ వస్తున్నాడు
రాష్ట్రంలో కొత్తబిచ్చగాడు జయలు దేరాడు. బాబాయిని గొడ్డలితో లేపేసింది ఎవరు అని అడుగుతున్నా? డ్రామా ఆడాడా లేదా? ఆపై మాపై నెట్టాడా లేదా? కోడి కత్తి డ్రామా ఆడాడు. నిన్న గులకరాయి డ్రామా మొదలెట్టాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే గులకరాయి వేయించారని తప్పుడు ప్రచారం మొదలెట్టాడు. క్వాటర్ బాటిల్, బిర్యాని, ఐదు వందలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు కాబట్టే జగన్ రెడ్డిపై గులకరాయి వేశామని ఆ పిల్లలు చెబుతున్నారు. గౌడ కులానికి చెందిన బాలుడు సోదరి శీలాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తే.. ఆ పిల్లవాడిని నడిరోడ్డులపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆరోజు గుర్తుకు రాలేదా సైకో జగన్ రెడ్డికి. నాపై, పవన్ కళ్యాణ్ పై రాళ్లు వేసినప్పుడు జగన్ ఏనాడు ఖండిచలేదు. అయినప్పటికీ నేడు జగన్ పై రాయిపడితే నేను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలు ఖండించాం.

మేము ఏమి మాట్లాడకపోయినా రాయిపడిన అర్ధగంటలో మేమే వేయించామని డ్రామాల రాయుడు మరలా వస్తున్నాడు. మాపై వేయించిన రాళ్లు దొరికాయి. కానీ, డ్రామా రాయుడు జగన్ రెడ్డిపై వేసిన రాయి ఇంకా దొరకలేదు. ఏంటి ఈ రహస్యం. ఇవి జగన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు. నిజాలు చెప్పమని అడుగుతున్నాం. మధ్యం, ఇసుక మాఫియాతో సంపాధించిన డబ్బులతో మరలా మిమల్ని కొనాలని చూస్తున్నాడు. డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తారా అని అడుగుతున్నా. మా వద్ద డబ్బులు లేకపోవచ్చు. కానీ, మా వద్ద నీతి, నిజాయితీ, నిస్వార్ధాలు ఉన్నాయి. మరలా మీ జీవితాల్లో వెలుగులు నింపే సామర్ధ్యం ఉందని హామీ ఇస్తున్నాం. మే కలిశామని విమర్శిస్తున్నాడు జగన్. మే కలిసింది రాష్ట్రం కోసం. మేం తగ్గింది ప్రజల గెలుపుకోసం. మావి మూడు జెండాలు..కానీ ఒకే అజెండా. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా.

సానుభూతి కోసం శవాలను వెంటేసుకుని వస్తున్నాడు. జగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు. 2014 లో తండ్రిలేని బిడ్డనని వచ్చాడు. 2019లో బాబాయి లేని బిడ్డనంటూ వచ్చాడు. ఇప్పుడు మరలా ఫించన్‌దారులను చంపి ఆ శవాలతో వస్తున్నాడు. సానుభూతి కోసం శవాలను వెంటేసుకుని వస్తున్నాడు. జగన్ రెడ్డి నాటకాలు ఇకపై చెల్లవు. 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైకాపాకు రాజీనామా చేసి కూటమిలో చేరుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీపీలు అందరు వచ్చి ఎన్డీఏలో చేరాలని పెడన సభ ద్వారా పిలుపునిస్తున్నా. ఐదేళ్లలో విధ్వంసం, అహంకారం, లేకలేనితనంతో రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు. దాన్ని సరిచేసుకోవడానికి మీరందరు సహకరించాలి.

సంపద చెట్లకు కాయదు…సృష్టించాలంటే కష్టపడి పనిచేయాలి
విభజన తర్వాత రాష్ట్రానికి నష్టం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడ్డారు. 2014 లో పోటీ చేయకుండా ఎన్డీఏకు సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పట్టిసీమను పూర్తి చేసి రైతులకు రెండో పంటకు నీరిచ్చాం. 72 శాతం పోలవరం పూర్తి చేశాం. తెదేపా అధికారంలో ఉండి ఉండే 2020 కే పోలవరం పూర్తి చేసి కృష్ణాడెల్టాకు మూడు పంటలకు నీరిచ్చేవాళ్లం. పోలవరాన్ని గోదావరి ముంచిన దుర్మార్గుడు జగన్. సంపద చెట్లకు కాయదు. సంపద సృష్టించాలంటే పనిచేయాలి. సంపద సృష్టిస్తే మన ఆదాయం పెరుగుతుంది. దానితో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు. 1995-96 లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఎకరం లక్ష రూపాయలు మాత్రమే. తర్వాత ఐటెక్ నిర్మాణం జరిగిన తర్వాత ఎకరం రూ.100 కోట్ల రూపాయలకు వెళ్లింది. అది సంపద సృష్టించే విధానం. ఒక ఇండస్ట్రీ వస్తే..ఆదాయం వస్తుంది. రైతుల పొలాలకు నీరిస్తే..గిట్టుబాటు ధరలు కల్పిస్తే..ఆదాయం పెరుగుతుంది. రైతుల కూలీలు బాగుపడతారు. ఒక రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. మచిలీపట్నం-విజయవాడ నేషనల్ వైవే ఎవరి హయాంలో వచ్చిందని అడుగుతున్నా? పెడనను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. బందరు పోర్టు, రాజధాని అమరావతి నిర్మాణం జరిగితే..పెడన ఒక అద్బుతమైన టౌన్ షిప్ గా ఎదిగి ఇక్కడ పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి.

100 సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశావ్ జగన్
సంక్షేమం అని గొప్పలు చెప్పే జగన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన 100 సంక్షేమ పథకాలను ఎందుకు రద్దు చేశావ్ అని అడుగుతున్నా. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశావ్ జగన్ రెడ్డి? చంద్రన్న భీమా, పండుగ కానుకలు, విదేశీ విద్యం, రంజాన్ తోఫా లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేశావు. నవరత్నాలను నవ మోసాలు చేశాడు. అవి నవరత్నాలు కాదు. అవి నకిలీ రత్నాలు. మడమ తిప్పను..మాట తప్పను అని మాట్లాడాడు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడు. మధ్యనిషేదం చేస్తానన్నాడు. అప్పుడే మిమ్మల్ని ఓట్లు అడుగుతా అన్నాడు. కానీ, మడమ తిప్పాడు. తెలుగుదేశం హయాంలో క్వాటర్ మందు బాటిల్ రూ.60 లు. ఇప్పుడు రూ.200 అయ్యింది. పెరిగిన ధర రూ.140 జగన్ రెడ్డి తాడేపల్లి ఫ్యాలెస్ కి వెళ్లాయి. తోపుడు బండ్ల వ్యాపారుల వద్ద కూడ ఆన్‌లన్ పేమెంట్లు ఉన్నాయి..కానీ, జే-బ్రాండు మందు షాపుల్లో మాత్రం క్యాష్ మాత్రమే ఇవ్వాలి. ఇది అవినీతి కాదా అడుగుతున్నా. మద్యంలో కూడా రక్తాన్ని త్రాగే దుర్మార్గుడు..ఈ జే-గన్ రెడ్డి.

కృష్ణా నది పక్కనే ఉన్న ఇసుక దొరకని పరిస్థితి
కృష్ణా నది ప్రక్కనే ఉన్న ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి అయితే ఇప్పుడు ఐదు వేలు అయ్యింది. సిమెంటు, ఇనుము ధరలు పెరిగాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను నట్టేటముంచాడు. రాష్ట్రం 30 సంవత్సరాలుల వెనక్కు వెళ్లింది. నేడు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక్కడున్న పోలీసులను అడుగుతున్నా…మీకు సక్రమంగా జీతాలు వస్తున్నాయా? మొదటి తారీఖున జీతాలు వచ్చాయా? టీఏలు, డీఏలు, ప్రావిడెంట్ ఫండ్స్ వచ్చాయా? జగన్ రెడ్డి ఉద్యోగులను బానిసలని అనుకుంటున్నాడు. ప్రతీ ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి బయపెట్టి పనిచేయించుకోవాలని చూస్తున్నాడు. భూ పరిరక్షణ చట్టం అని కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు. పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు జగన్ రెడ్డి వద్దే ఉంటాయి. జగన్ రెడ్డి బటన్ నొక్కితే రికార్డుల్లో మీ పేరు మారిపోతుంది. మీ రాత మారిపోతుంది. మీరే ఆలోచించండి. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి టెక్నాలజీని తప్పుడు పనులకు ఉపయోగిస్తే సర్వనాశం అవుతాం. అదే టెక్నాలజీని మంచికోసం వాడితే..జీవితాల్లో వెలుగులు నింపగలం. నాయకులను, కార్యకర్తలను రాబోయే 25 రోజులు కష్టపడాలని కోరుతున్నా. ప్రజలకు అండగా నిలబడి ఓట్లేయించే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని గౌరవించే బాధ్యత కూటమి తీసుకుంటుంది. రాబోయే కూటమి ప్రభుత్వంలో ప్రతీ మూడు పార్టీల కార్యకర్తలకు న్యాయం చేస్తాం. ఓట్లు చాలా ముఖ్యం. ఇక్కడ బాలశౌరి గెలుపొందుతున్నారు

కమీషన్ల కక్కుర్తితో బందరు పోర్టు సర్వనాశనం
యువగళం సమావేశాల్లో నూటికి 70 శాతం మంది యువకులే కనిపిస్తున్నారు. యువకుల నైపుణ్యాలను పెంచాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో తపనపడుతున్నారు. ప్రతీ మండలం హెడ్ క్వాటర్ లలో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యువకులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం పెడుతాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ ఉద్యోగాలు పూర్తి చేస్తాం. బందరులో పోర్టు పూర్తయితే పరిశ్రమలు వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. పిపిపి విధానంలో రూపాయి ఖర్చు లేకుండా బందరు పోర్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేశాం. కానీ, ఈ దుర్మార్గుడు వాటిని మార్చి ఈపీసీ మోడల్ అని తీసుకొచ్చి ప్రభుత్వం అప్పులు చేసి నేడు ప్రైవేటుపరం చేశాడు.

ఆ బందరు పోర్టులో కూడా కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఏ విధానమైన మీకు మేలు జరగాలి. యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇచ్చే బాధ్యత నాది. వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తాం.. ప్రపంచస్థాయి పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలకు పింఛన్ పెంచి ఇస్తాం. ఏప్రిల్ నెల నుంచే పెంచిన పింఛన్ మూడు నెలల సొమ్మును జూలై నెలలో రూ.7 వేలు మీ ఇంటివద్దకే అందజేస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిది. మీరు ఆర్థికంగా ఎదగడానికి ఆదరణ ఇస్తాం.

కర్రలు, రాళ్లలో నా ఇంటిపైకి వచ్చినప్పుడు మీ బుద్ధి ఏమైంది?
నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడే పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ మైలవరంలో పుట్టాడు. ఇక్కడి ప్రజలు నమ్మి గెలిపిస్తే మిమ్మల్నే మోసం చేశాడని పెనమలూరుకు పంపారు. అక్కడి ప్రజలు కూడా జోగి రమేష్కుం బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఓడిపోతే బంగాళాఖాతంలో కలిసిపోతాడు. సైకో జగన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయాడు. ఇకముందు మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా. ఉండవల్లిలో నా నివాసానికి పనికిరాని జోగి రమేష్ను్ సీఎం జగన్ రెడ్డి రాళ్లు, కర్రలు ఇచ్చి పంపాడు. సీఎంకి చిన్న గాయమైందని అతి బాధపడిపోతున్నాడు. మరి కర్రలు, రాళ్లు ఎత్తుకొచ్చినప్పుడు మీ బుద్ధి ఏమైంది.. మా ప్రాణాలకు లెక్కలేదా? మీ ప్రాణాలు మాత్రమే విలువైనవా?. నియోజకవర్గంలో జోగి రమేష్ భూకబ్జాలు, సెటిల్మెంెట్లు, బెదిరింపులు, కమీషన్లకు పాల్పడ్డాడు. పవన్ కల్యాణ్, సినీ హీరోల సినిమాల్లో కూడా ఇంత భయంకరమైన దోపిడీ ఉండదు.

స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం
పెడన పట్టణంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. జగన్ రెడ్డి మీకిచ్చింది ఒక సెంటు మాత్రమే.. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.1.50 లక్షలు, నరేగా కింద రూ.30 వేలు ఇస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు నుంచి ఇళ్ల నిర్మాణాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. సెంటు పట్టా పేరుతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. పనికిరాని వాగులు, వంకలు, అడవులు, స్మశానాల్లో ఇంటి స్థలాలు ఇస్తే.. పేదలు ఆ స్థలాల్లో ఎలా ఇళ్లు కట్టుకొని నివసిస్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనువైన స్థలాల్లో టిడ్కో ఇళ్లు నిర్మించాం. వాటిని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వకుండా దగా చేశారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా లబ్ధిదారులందరికీ ఇళ్లు ఇస్తాం.

ప్రత్యేక డిక్లరేషన్ తో ముస్లింలను ఆదుకుంటాం
ముస్లిం సోదరులకు నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధమైన ఇబ్బంది కలకుండా పాలన సాగించాం. భవిష్యత్తులో కూడా ముస్లింలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తాం. 1995-2004 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఏ ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. ఉర్దూ యూనివర్సిటీ నిర్మించాం, షాదీఖానాలు, హజ్ హౌస్లుం నిర్మించాం. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు చేసి ఆదుకున్నాం.. ఇక ముందు కూడా ఆదుకుంటాం. 2014-2019 వరకు సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం. భవిష్యత్తులో కూడా ముస్లింలకు ప్రత్యేక డిక్లరేషన్ పెట్టి ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం.

రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే ఎన్డీఏకే ఓటేయాలి
ఎంపీ అభ్యర్థిగా బాలశౌరికి ఓటేసి గెలిపిస్తే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కస్తారు. వైసీపీకి ఓటేస్తే ఎవరిని అడిగి నిధులు సాధిస్తారో సమాధానం చెప్పాలి. అందుకే ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తే నేరుగా నిధులు సాధించుకునే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపిస్తే బాబాయ్ హత్య కేసు నుంచి భయటపడేందుకే పాకులాడారు తప్పితే.. నిధులు సాధించేందుకు కృషిచేయలేదు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే, రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే ఎన్డీఏకే ఓటేయాలి.

వైసీపీకి ఓటేసిన లాభం లేదని ప్రజలు గ్రహించాలి. 400 సీట్లతో వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధాని అవ్వబోతున్నారు. 2047కి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని నేను, పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నాం.. తప్పకుండా సాధిస్తామని హామీ ఇస్తున్నా. ఎన్డీఏ కూటమిని 160 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించాలి.. జగన్ రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోవాలి. వైసీపీని భూస్థాపితం చేయాలి, బంగళాఖాతంలోనైనా కలిపేయాలనే లక్ష్యంతో పనిచేయాలని మీ అందరికి పిలుపునిస్తున్నా.

Leave a Reply